తడిసి ముద్దైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా

జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌ నుంచి రాయచూరు వెళ్లే రహదారిలో బొంకూరు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది...

తడిసి ముద్దైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా
Follow us

|

Updated on: Jul 26, 2020 | 7:41 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు చోట్ల శనివారం భారీ వర్షం కురిసింది. వనపర్తి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇదే భారీ వానగా వాతావరణ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30కి మొదలైన వాన ఎడతెరిపి లేకుండా మూడు గంటల పాటు కురిసింది.

తడిసి ముద్దైన జోగులాంబ జిల్లా..

జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌ నుంచి రాయచూరు వెళ్లే రహదారిలో బొంకూరు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో కృష్ణ, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది. ఉండవల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో నీరు చేరింది.

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుకు పెరిగిన వరద

జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు గత 24 గంటల్లో  54,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. మూడు గేట్ల ద్వారా, పవర్‌హౌస్‌ నుంచి మొత్తంగా 51,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది ద్వారా భారీ వరద వస్తుండటంతో సుంకేసుల ప్రాజెక్టులో రెండు గేట్లు తెరిచి శ్రీశైలానికి నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 85,413 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది.