వానలు మళ్లీ దంచికొడుతున్నాయి..!

Monsoon 2019: Heavy Rains Falling in Kurnool, వానలు మళ్లీ దంచికొడుతున్నాయి..!

కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి‌. తమడపల్లె గ్రామం వద్ద రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లుడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస్తుంది. మహానంది అగ్రికల్చరల్ కాలేజ్ వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలేజ్ లోని గోషాలలోకి నీరు రావడంతో గోవులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. మహానంది పరిధిలోని ఈశ్వర్ నగర్, అబ్బిపురం, పుట్టుపల్లె గ్రామాలలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ నీరు ముంచెత్తింది. స్కూల్, కాలేజీలకు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుందూనది ఉధృతంగా ప్రవహించడంతో నదీపరివాహక ప్రజలు అప్రమత్తంగా ‌ఉండాలని అధికారులు హెచ్చరించారు. నంద్యాల మండలం పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. కనుక చెరువు నిండుకుండలా మారింది. చెరువుకు కొన్ని చోట్ల నెర్రలు ఇవ్వడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *