వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజుల పాటు జోరు వానలు

వరుస అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తాజాగా మరో ఉత్తర అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని

వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజుల పాటు జోరు వానలు
Follow us

|

Updated on: Oct 08, 2020 | 6:00 AM

వరుస అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తాజాగా మరో ఉత్తర అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తెలిపింది. 11వ తేదీ సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులెవ్వరూ తీరం వెంబడి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.