చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు

అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాకాల దగ్గర వంక పొంగి పొర్లుతోంది. వాగు నీరు రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి 3.30 గంటల సమయంలో బైక్ పై రోడ్డు దాటుతూ ఇద్దరు యువకులు వర్షం నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. బైక్ తో పాటు కొట్టుకుపోయిన తులసి రాం, తరుణ్ అనే ఇద్దరిని పోలీసులు క్షేమంగా […]

చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు
Follow us

|

Updated on: Oct 11, 2020 | 7:57 AM

అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాకాల దగ్గర వంక పొంగి పొర్లుతోంది. వాగు నీరు రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి 3.30 గంటల సమయంలో బైక్ పై రోడ్డు దాటుతూ ఇద్దరు యువకులు వర్షం నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. బైక్ తో పాటు కొట్టుకుపోయిన తులసి రాం, తరుణ్ అనే ఇద్దరిని పోలీసులు క్షేమంగా కాపాడారు. చంద్రగిరి మండలం గాదంకి నుంచి బంగారుపాలెం సమీపంలోని అమరరాజా ఫ్యాక్టరీకి వెళుతుండగా ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు.