విరిగిపడుతున్న కొండచరియలు.. జనజీవనం అస్తవ్యస్తం

హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు..

విరిగిపడుతున్న కొండచరియలు.. జనజీవనం అస్తవ్యస్తం
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 5:46 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్రంలోని చమోలీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో స్థానిక జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో విరిగిపడ్డ కొండచరియలతో దాదాపు ఇరవై కిలో మీటర్ల దూరం రహదారులు మూతపడ్డాయి. ఇక వరద నీరు భారీగా చేరడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చిన్న చిన్న వంతెనలు మునిగిపోయాయి. ఇదిలావుంటే.. చమోలీ, నైనిటాల్‌, ఉధమ్‌ సింగ్ నగర్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, హరిద్వార్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్