హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..
Follow us

|

Updated on: Sep 11, 2020 | 7:06 PM

Heavy Rainfall: హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా పోయింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలైనా.. సిటీ అంతటా దట్టమైన నల్లమబ్బులు కమ్ముకుని.. సాయంత్రం వేళ వర్షం ముంచెత్తింది. దీనితో రోడ్లన్నీ జలమయం కాగా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా ఒక పక్క కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలా వర్షాలు కురిస్తే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!