గుజరాత్‌లో వరద బీభత్సం..నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

ఓ వైపు కరోనా, మరోవైపు వరుణుడి బీభత్సంతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్‌ వణికిపోతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు

గుజరాత్‌లో వరద బీభత్సం..నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Follow us

|

Updated on: Jul 08, 2020 | 7:04 PM

ఓ వైపు కరోనా, మరోవైపు వరుణుడి బీభత్సంతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్‌ వణికిపోతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పలు జిల్లాలు నీటమునిగాయి. రోడ్లపైన భారీగా వరద నీరు పొంగిపోర్లుతోంది. దీంతో చాలా చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌ సిబ్బంది రెండు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ రోడ్లపై నీటిప్రవాహం తగ్గడం లేదని స్థానికులు వాపోతున్నారు.

వర్షాలు తగ్గితే కాని పరిస్థితి కుదుటపడకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ద్వారకా నగరంలో కురిసిన వర్షాలతో వరద రోడ్లపైకి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజరాత్‌లో మంగళవారం వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురవడంతో గత రెండు రోజుల్లో సౌరాష్ట్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 1,000 మందికి పైగా ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినట్లు సమాచారం. అదే విధంగా బుధవారం కూడా కచ్‌ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో అక్కడి రోడ్లన్నీ వరదతో నిండిపోయాయి.