Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

అరేబియాలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో‌ భారీ ఎఫెక్ట్..!!

Heavy Rainfall expected in AP and Telangana says IMD Officers, అరేబియాలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో‌ భారీ ఎఫెక్ట్..!!

అరేబియా మహా సముద్రంలో అల్పపీడనంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందుని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది.

అంతేకాకుండా.. లక్షద్వీప్‌లో ఐఎండీ అధికారులు.. రెండు రోజుల పాటు రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు. ఇది వాయుగుండంగా మారడంతో.. తూర్పు, ఆగ్నేయం దిక్కుల నుంచి తెలంగాణ మీదకు గాలులు వీస్తున్నాయని సమాచారం. ఈ గాలులతో తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పాడుతున్నాయని.. వీటి ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని.. మరో మూరు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతవరణ శాఖ కేంద్ర వెల్లడించింది.

ఇక.. ఏపీలో ఇప్పటికే.. తీవ్ర ప్రభావ వర్షాలతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరోమారు హెచ్చరికతో.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏపీలోని.. సముద్రంలో.. వేటకు మత్స్యకారులు వెళ్లద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.