Breaking News
  • అమరావతి: సోషల్ మీడియాలో న్యాయమూర్తులు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
  • విజయనగరం : అశోక్ గజపతిరాజు, మాజీ కేంద్రమంత్రి కామెంట్స్. మాన్సస్ ట్రస్ట్ ఎమ్ ఆర్ కాలేజ్ లో ఎందరో ప్రముఖులు విద్యానభ్యసిస్తున్నారు. మాన్సస్ ట్రస్ట్ లోని ఎయిడెడ్ కళాశాలలను ప్రవేటికరణ చేయటం కరెక్ట్ కాదు. నేను చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా అనేక సూచనలు వచ్చాయి. సంస్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశాను.
  • తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చండి. హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం . మూడు వారాల తర్వాత విచారణ చేయనున్న సుప్రీంకోర్టు. తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడిన ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని క్వాష్ పిటిషన్ వేసిన సుధీర్ బాబు. దర్యాప్తును ఆపేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వారంలోగా ఈ కేసును పూర్తిచేయాలని హైకోర్టు ను ఆ దేశించిన సుప్రీం . హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.
  • విజయవాడ: సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రేపటికి ఏడాది పూర్తి. గత ఏడాది గాంధీ జయంతి రోజు ప్రారంభించాం. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం-పెద్దిరెడ్డి. ప్రతి యాబై కుటుంబాలకు గ్రామ, వార్డు వాలంటీర్‌ను అందుబాటులో ఉంచాం. అవినీతికి తావు లేకుండా సేవలందిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం సచివాలయ పనితీరును అభినందించారు.
  • ఏపీలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 మంది మహిళా అధ్యక్షురాలను ప్రకటించిన టీడీపీ . 25 మంది మహిళా ప్రధాన కార్యదర్శిలను ప్రకటించిన టీడీపీ . 50 పార్టీ పదవుల్లో 21 మంది బీసీ మహిళలు, 8 మంది ఎస్సీ మహిళలు.. ఇద్దరు ఎస్టీలు, 19 మంది ఓసీల ప్రకటన . మహిళా కమిటీలను ప్రకటించిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత.
  • అమరావతి: కోనసీమ ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్‌ 14ఏళ్ల కల. బినామీ సంస్థలతో కోన ప్రాంతాన్ని కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టికొట్టం హేయమైన చర్య. కాకినాడ సెజ్‌ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలి. జగన్‌ బినామీ అవినీతి లావాదేవీలపై దర్యాప్తు చేపట్టాలి. పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలి. కాకినాడ సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ పెడితే.. కోనసీమ ప్రాంతం కాలుష్య ప్రాంతమే-మాజీ మంత్రి యనమల .
  • విశాఖ: యూపీ అత్యాచార ఘటనకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర దళిత, మహిళా సంఘాల ఆందోళన.

గర్జించిన ఆకాశం..హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో కారుచీకట్లు కమ్మేశాయి. సూర్యాస్తమయంకు ముందే నల్లటి మేఘాలు చుట్టేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తోంది...

Heavy rain, గర్జించిన ఆకాశం..హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో కారుచీకట్లు కమ్మేశాయి. సూర్యాస్తమయంకు ముందే నల్లటి మేఘాలు చుట్టేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తోంది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా… సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరాన్ని ముంచెత్తింది. కారుమబ్బులు కమ్ముకోగా కాసేపటికే ఉరుములతో ఆకాశం గర్జించింది. కుండపోత వానకు తోడు పిడుగులు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో పిడుగులు పడ్డాయి. భారీగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు వరద కాలువలను తలపించాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయం కాగా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉంది. మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Tags