హైదరాబాద్‌లో భారీ వర్షం

Heavy Rain Lashes Hyderabad, హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ ఎత్తున ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, సికింద్రాబాద్, బేగంపేట, చిక్కడపల్లి, రాంగనర్, ఉప్పల్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, సంతోష్‌ నగర్, హయత్‌నగర్, అల్వాల్, ఈసీఐఎల్, తిరుమలగిరి, యాప్రాల్ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర‌ అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ దాన కిషోర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *