తిరుమలలో కుండపోత వర్షం: ఇక్కట్లలో భక్తులు
తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో తిరుమలంతటా దట్డంగా మబ్బులు కమ్ముకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ప్రాంతం నుంచి అడుగు తీసి బయటపెట్టలేకపోతున్నారు. మరికొంతమంది భక్తులు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో […]
తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో తిరుమలంతటా దట్డంగా మబ్బులు కమ్ముకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ప్రాంతం నుంచి అడుగు తీసి బయటపెట్టలేకపోతున్నారు. మరికొంతమంది భక్తులు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో భక్తులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.