మరో అల్పపీడనం.. హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఏపీలోని ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.!

ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది.

  • Ravi Kiran
  • Publish Date - 7:04 am, Sun, 22 November 20

Rains In Andhra Pradesh: ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణించి.. ఈ నెల 25న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే ఈ నెల 24,25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గంటకు 55 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఆయా తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!