రికార్డు స్ధాయిలో ముంబైలో వర్షపాతం

ముంబైలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 3,286.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 2010 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం తర్వాత ఈ ఏడాది అత్యధికంగా కురిసినట్టు అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఈ నెలలో ఇంకా 20రోజులు మిగిలి ఉన్నందున ఇంకా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 2010,2011లో నమోదైన వర్షపాతాన్ని ఈ ఏడాది కురిసే […]

రికార్డు స్ధాయిలో ముంబైలో వర్షపాతం
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 5:36 PM

ముంబైలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 3,286.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 2010 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం తర్వాత ఈ ఏడాది అత్యధికంగా కురిసినట్టు అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఈ నెలలో ఇంకా 20రోజులు మిగిలి ఉన్నందున ఇంకా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 2010,2011లో నమోదైన వర్షపాతాన్ని ఈ ఏడాది కురిసే వర్షాలు బ్రేక్ చేస్తాయంటున్నారు వాతావరణ అధికారులు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 10న వస్తాయనకున్న నైరుతీ పవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ముంబైలో రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. మహారాష్ట్రలో ఏకంగా పలు జిల్లాలు వర్షాలతో అతలాకుతలమైపోయాయి. ఆదివారం ఒక్కరోజే కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది.