మరో నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Heavy Rain Alerts In Telugu States, మరో నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని.. మరో నాలుగైదు రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది. ఇక శనివారం ఒకట్రెండు చోట్ల తప్పితే మిగిలిన అన్ని చోట్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఈ నెల 4న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది మరింత తీవ్రంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తే మాత్రం దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగానే ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *