Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య. గత కొద్దిరోజుల క్రితం.. ఇతని కూతుర్ని.. ఘట్కేసర్ లో ఒకతను గొంతుకోసి చంపటం జరిగింది.
  • హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నిర్వాకం. అధిక రెట్ ల తో సినిమా టికెట్ల విక్రయం. సినిమా టికెట్ ల పై 10 శాతం అధికంగా . జీ ఎస్టీ ఛార్జ్ వసూలు. 18 శాతం కు బదులు 28 శాతం టాక్స్ విధించి టికెట్ విక్రయం పై 30 లక్షలు ఆదాయం. జి ఎస్టీ అధికారులకు గతం లో పలు ఫిర్యాదులు.
  • సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి. భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి. ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • కోవిడ్-19పై ప్రధాని సమీక్షా సమావేశం. భేటీలో ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హోంమంత్రి. కోవిడ్-19 తాజా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై చర్చ.
  • టీవీ9 మేయర్ బొంతు రామ్మోహన్: సచివాలయ కూల్చివేతలు సందర్భంగా పర్యావరణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూల్చివేత లకు జిహెచ్ఎంసి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. భారీ స్థాయిలో వచ్చే శిధిలాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టపోతున్నాం... కొన్ని వందల లారీల్లో శిథిలాలను జీడిమెట్ల లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి తరలిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే శిథిలాల తరలింపును చేపడతాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, రోడ్లు పాడవకుండా అన్ని జాగ్రత్తలు ఇలా తరలింపులో తీసుకుంటాం.. సచివాలయ శిథిలాల నుంచి కంకర, ఐరన్, డస్ట్ వేరుచేస్తారు.
  • నల్లకుం లోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడ లోని రైల్వే హాస్పిటల్ కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా టెస్ట్ లు జరుగుతోన్న తీరు, వైద్య సిబ్బంది జాగ్రత్తలపై వివరాలను ఆరా తీసిన కేంద్రమంత్రి. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

శ్రీవారి లడ్డూ ప్ర‌సాదానికి ఊహించని డిమాండ్.. 3 గంటల్లో 2.4 లక్షలు విక్రయం

Tirupati Laddu Sales Starts In 12 Districts Of Andhra Pradesh, శ్రీవారి లడ్డూ ప్ర‌సాదానికి ఊహించని డిమాండ్.. 3 గంటల్లో 2.4 లక్షలు విక్రయం

తిరుమల వెంక‌న్న‌ లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స్ లో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో స్వామివారి ల‌డ్డూల కోసం అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. కాగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరులో సైతం లడ్డూల‌ను అమ్మేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.అయితే శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి  ఊహించ‌ని ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. సోమవారం కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు విక్రయించింది టీటీడీ. మంగళవారం మరో 2 లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు త‌మ ప్రాంతాల‌లో కూడా విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల కూడా కోరుతున్నారు. దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాలోచ‌న‌లు చేస్తోంది.

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఇన్ఫ‌ర్మేష‌న్ కోసం టీటీడీ.. కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు‌. 1,000కి పైగా లడ్డూలు కొనుగోలు చేయాలనుకున్న భక్తులు తమ పూర్తి వివ‌రాల‌ను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది.

Related Tags