హైదరాబాద్‌లో కుప్పకూలిన భారీ క్రేన్..!

హైదరాబాద్ షేక్‌పేటలో ప్రమాదం జరిగింది. నాలా వద్ద రోడ్డుపై భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై క్రైన్ పడిపోవడంతో.. గచ్చిబౌలి-మెహిదీపట్నంకు వెళ్లే దారిలో భారీగా ట్రిఫిక్ జామ్ అయ్యింది. వర్కింగ్ డే కావడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటంతో షేక్‌పేట నాలా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఒక్కసారిగా క్రేన్ కూలి […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:57 am, Tue, 2 July 19

హైదరాబాద్ షేక్‌పేటలో ప్రమాదం జరిగింది. నాలా వద్ద రోడ్డుపై భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై క్రైన్ పడిపోవడంతో.. గచ్చిబౌలి-మెహిదీపట్నంకు వెళ్లే దారిలో భారీగా ట్రిఫిక్ జామ్ అయ్యింది. వర్కింగ్ డే కావడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటంతో షేక్‌పేట నాలా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఒక్కసారిగా క్రేన్ కూలి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.