ఆసుపత్రిలో బీభత్సం.. పాక్ భారీకాయుడి మృతి

Heaviest Pak Man Dieson, ఆసుపత్రిలో బీభత్సం.. పాక్ భారీకాయుడి మృతి

పాకిస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని అత్యంత భారీకాయుడిగా పేరున్న నూరుల్ హసన్ చనిపోయాడు. దాదాపు 330 కిలోల బరువు ఉన్న నూరుల్‌కు.. ఇటీవలే లాహోర్‌లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆపరేషన్ చేసింది. అనంతరం ఆయన్ను ఐసీయూకు తరలించారు. అయితే నూరుల్ పరిస్థితి దృష్ట్యా అతనికి ఎక్కువ మంది వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరైంది. వైద్యులు లేకపోవడం వల్ల అదే ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ సరైన వైద్యం అందక చనిపోయింది. దీంతో ఆ మహిళ కుటుంబసభ్యులు ఆస్పత్రిలోని ఐసీయూలోకి చొచ్చుకువెళ్లి ఆందోళనకు దిగారు. కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

ఈ ఘర్షణ నేపథ్యంలో ఐసీయూలో ఉన్న నర్సులు, డాక్టర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో నూరుల్ హసన్‌కు సరైన పర్యవేక్షణ లేక పోవడంతో అస్వస్థతకు లోనయ్యాడు. వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. కాసేపటి తరువాత నర్సు వచ్చి చూస్తే.. హసన్ ఊపిరందక గిలగిలా కొట్టుకుంటూ కనిపించారు. వెంటనే చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం దర్యాప్తుకు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *