గరంగరంగా ఏపీ శాసనమండలి.. టీడీపీ వర్సెస్ వైసీపీ

అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ శాసనమండలిలో అట్టుడికింది. ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. బ్రిటీష్ కౌన్సిల్‌కు ఏడు కోట్లు, జ్ఞానబేరి కార్యక్రమానికి 5.4 కోట్ల రూపాయలు ఇచ్చారన్న విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ వ్యవహారాల్లో అప్పటి మంత్రి, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి నారాలోకేష్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంగళగిరిని మందలగిరి అని […]

గరంగరంగా ఏపీ శాసనమండలి.. టీడీపీ వర్సెస్ వైసీపీ
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 2:27 PM

అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ శాసనమండలిలో అట్టుడికింది. ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. బ్రిటీష్ కౌన్సిల్‌కు ఏడు కోట్లు, జ్ఞానబేరి కార్యక్రమానికి 5.4 కోట్ల రూపాయలు ఇచ్చారన్న విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ వ్యవహారాల్లో అప్పటి మంత్రి, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి నారాలోకేష్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంగళగిరిని మందలగిరి అని లోకేష్ అంటారని, లోకేష్‌కు మాతృభాషలో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని అనిల్ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారని విమర్శలు గుప్పించారు.

దీంతో అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని.. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. అంతేకాకుండా.. సీఎం వైఎస్ జగన్‌ 43వేల కోట్లు దోచుకొని.. 16నెలలు జైలులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుపై 26 కేసులు ఉంటే స్టే తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందనగా లోకేష్.. ఇదంతా తాను చెప్పింది కాదని, ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్నదేనని అన్నారు. దీనిని వైసీపీ మంత్రులు ఖండిస్తూ.. ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు లోకేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య గందరగోళం చెలరేగడంతో సభను రేపటికి వాయిదా వేశారు.