కర్నూలు జిల్లాలో విషాదం… భార్య అంత్యక్రియల కోసం..!

కర్నూలు జిల్లా మహానందిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం లేని మనుషులు దేశంలో ఇంకా ఉన్నారు అనడాని ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. డోన్ పట్టణానికి చెందిన నాగరాజు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి రెండేళ్ల కిందట సుజాత అనే మహిళతో ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది. ఇద్దరు రెండేళ్ళ క్రిందట వివాహం చేసుకున్నారు. ఇద్దరు అనాధలు కావడంతో ఊరూరు తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. కొన్ని రోజుల […]

కర్నూలు జిల్లాలో విషాదం... భార్య అంత్యక్రియల కోసం..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 1:38 PM

కర్నూలు జిల్లా మహానందిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం లేని మనుషులు దేశంలో ఇంకా ఉన్నారు అనడాని ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. డోన్ పట్టణానికి చెందిన నాగరాజు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి రెండేళ్ల కిందట సుజాత అనే మహిళతో ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది. ఇద్దరు రెండేళ్ళ క్రిందట వివాహం చేసుకున్నారు. ఇద్దరు అనాధలు కావడంతో ఊరూరు తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు.

కొన్ని రోజుల కిందట వారిద్దరూ మహానంది లో నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. సుజాత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించింది.తన భార్య మరణంతో తనకంటూ ఉన్న ఒక దిక్కును కోల్పోయిన నాగరాజు ఆమె అంత్యక్రియలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకువెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. తన దీన స్థితిని వివరిస్తూ.. సాయం చేయండని కనిపించిన వారినల్లా కోరాడు. కొందరు బాటసారులతోపాటు.. మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి… సుజాత అంత్యక్రియలకు ఆర్థికసాయం చేశారు. నలుగురు చెయ్యాల్సిన అంత్యక్రియలు తాను ఒక్కడే చేయడానికి పూనుకున్నాడు. ఎవరు సహకరించకపోవడంతో అతని భుజాలపై భార్య మృతదేహాన్ని వేసుకొని అంత్యక్రియలు చేయడానికి వెళ్ళాడు. అది చూసిన దేవాలయ అధికారులు చెత్తకు వాడే వాహనాన్ని నాగరాజుకు అందజేసారు. భార్య మృతదేహాన్ని దాంట్లో వేసుకొని అంత్యక్రియల కార్యక్రమం ముగించాడు. ఈ తతంగాన్ని గమనిస్తున్న ఓ వ్యక్తి అతనికి సహకరించకపోగా అ ఫోటోలను తీసి సొషల్‌ మీడియాలో షేర్ చేయడం కొసమెరుపు.