ఆరోగ్యానికి సూత్రాలెన్నో ! ఆచరించండి మరి !

article on health, ఆరోగ్యానికి సూత్రాలెన్నో ! ఆచరించండి మరి !

ఆరోగ్యంపై చూపే ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు. వాతావరణం, లైఫ్ స్టైల్, బిహేవియర్.. ఇలాంటివెన్నో ఉన్నాయి. మంచి ఆరోగ్యం అన్నది వీటిమీదే కాదు.. వ్యక్తుల జన్యువులపైన, కల్చర్, ఎన్విరాన్ మెంట్ వంటివాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. వాతావరణ కాలుష్యం గురించి చెప్పుకోవలసి వస్తే..ప్రతి ఏడాదీ దీని ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ప్రతివారూ ఈ అంశంపై మాట్లాడుతూనే ఉంటారు. కానీ కొంత కాలానికి అసలు ఈ విషయమే మర్చిపోతారు. ఏడాదంతా ఉండే కాలుష్యాన్ని మనం తేలిగ్గా పరిగణిస్తున్నాం.. మొదట దీనిపై గగ్గోలు పెట్టి.. ఆ తరువాత మరచిపోవడం రొటీన్ గా మారిపోయింది. పర్యావరణాన్ని కాలుష్య రహితంగా మార్చుకోవడం మన బాధ్యత.. ఇది మంచి అవకాశం కూడా.. కానీ దీన్ని పట్టించుకోకుండా సాగుతున్నాం.. వాతావరణ కాలుష్యం వల్ల వచ్ఛే వ్యాధులు, రోగాల గురించి అందరికీ తెలిసిందే. అలాగే మారుతున్న జీవన సరళి కూడా.. సరైన వేళకు ఆహారం తినకపోవడం, నిద్రవేళలు పాటించకపోవడం కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. article on health, ఆరోగ్యానికి సూత్రాలెన్నో ! ఆచరించండి మరి !

రెగ్యులర్ ఎక్సర్ సైజ్, నడక చాలా మంచివి. రోజుకు సగటున వెయ్యి అడుగులు (స్టెప్స్) వేయడం సింపుల్ టెక్నీక్. అయితే ఇది సులభమైనదే అయినా ఫిజికల్ యాక్టివిటీకి ఎంతో దోహదపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే మనం హెల్దీ ఫుడ్ నుంచి అన్ హెల్దీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివాటికి అలవాటు పడిపోయాం. ఇవి దాదాపు తప్పనిసరై పోయాయి. మంచి భోజనం మానేసి గంటల తరబడి ఉపవాసం చేయడం మంచిదేనా ? బ్రేక్ ఫాస్ట్, మోడరేట్ మీల్ తప్పనిసరి.. ఆకు కూరలు, ఫిష్, కొవ్వు లేని మాంసాహారం, కాయగూరలు మంచివని నిరూపితమైంది కూడా..
ఇక రోజుకు ఆరు గంటలనుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందే..లైట్ నైట్ పార్టీలు మంచివి కావు.. నిద్రను అసలు నిర్లక్ష్యం చేయరాదు. స్ట్రెస్ పలు గుండె జబ్బులకు కారణమవుతుంది. అందుకే యోగా, మెడిటేషన్ ఎంతో అవసరం.. వ్యాధులు, రోగాల విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. కేన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్న విషయాన్ని ఎప్పుడూ మరువరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *