Blood Sugar In Winter: అవునా..! చలికాలంలో షుగర్ పెరుగుతుందా? ఆసక్తికర కారణాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

సాధారణంగా ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అందరూ అంటుంటారు. అయితే వాతావరణ పరిస్థితులు కూడా శరీరంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Blood Sugar In Winter: అవునా..! చలికాలంలో షుగర్ పెరుగుతుందా? ఆసక్తికర కారణాలు.. తెలిస్తే షాక్ అవుతారు!
Blood Sugar
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 3:19 PM

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. చలిపులి పంజా విసురుతోంది. అందుకు తగినట్లుగా మన శరీరానికి కూడా కొన్ని అడ్జెస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చలి వాతావరణం చక్కెర స్థాయిలను బాగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో వేడి వాతావరణం ఇన్సులిన్‌ ను అధికంగా వినియోగించుకుంటుంది.  శీతాకాలంలో కూడా ఇన్సులిన్‌ పై అధిక ప్రభావం చూపుతుంది. అంతేకాక చక్కెర స్థాయిలను చూసుకునే క్రమంలో తప్పుడు రీడింగ్స్ చూపిస్తుంది. చలికాలం మనల్ని నిదానంగా, నీరసంగా, చురుకుదనం కోల్పోయినట్లు చేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనికి అధిక క్యాలరీలతో కూడిన వింటర్ కంఫర్ట్ ఫుడ్‌ తీసుకుంటే షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

కారణాలు ఇవి..

సాధారణంగా ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అందరూ అంటుంటారు. అయితే వాతావరణ పరిస్థితులు కూడా శరీరంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చలి కాలంలో బద్దకం పెరుగుతుంది. దీంతో యోగా, వ్యాయామం.. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో చేసే వాకింగ్ వంటివి పక్కన పెట్టేస్తాం. ఫలితంగా శరీరంలోని షుగర్ లెవెల్స్ అధికమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో తీసుకునే ఆహారం కూడా మధుమేహాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. అధికంగా చక్కెర తీసుకోవడం గ్లూకోజ్ స్థాయిలో పెరిగిపోతాయంటున్నారు. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్ స్టేజ్ ,డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న వ్యక్తులు వ్యాయామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానివేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తప్పుడు రీడింగులను ఎలా పరిష్కరించాలి..

ఉష్ణోగ్రత తగ్గుదల మధుమేహాన్ని కొలిచే పరికరాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది తప్పుడు రీడింగ్‌లకు దారి తీస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? లోతుగా పరిశీలిస్తే.. శీతల వాతావరణ పరిస్థితిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, రక్త ప్రసరణ కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మధుమేహం పరీక్ష కోసం స్ట్రిప్ పై రక్తాన్ని వేసినప్పుడు అది కచ్చితంగా తప్పుడు రీడింగ్స్ చూపిస్తుంది. అయితే పరీక్షకు ముందు చేతికి కాస్త వేడిని కల్గిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే పరీక్ష సామగ్రిని కూడా కనీసం రూమ్ టెంపరేచర్ లో ఉండేటట్లు చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..