Mango Powder: మామిడి పొడితో అనేక లాభాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Mango Powder: మామిడికాయ పొడిని ఎక్కువగా వంటలలో వినియోగిస్తారు. ఇది కూరల రుచిని పెంచుతుది. అయినప్పటికీ పొడి అన్ని కూరలలో వాడరు. మామిడి కాయ పొడి వంటల రుచిని

Mango Powder: మామిడి పొడితో అనేక లాభాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Mango Powder
Follow us

|

Updated on: Mar 15, 2022 | 5:43 AM

Mango Powder: మామిడికాయ పొడిని ఎక్కువగా వంటలలో వినియోగిస్తారు. ఇది కూరల రుచిని పెంచుతుది. అయినప్పటికీ పొడి అన్ని కూరలలో వాడరు. మామిడి కాయ పొడి వంటల రుచిని పెంచడంతో పాటు బరువు కూడా తగ్గిస్తుంది. నిజానికి మామిడికాయ పొడిలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది గర్భిణీలకి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా మామిడి పొడి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్య అదుపులో ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో మామిడికాయ పొడి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు కూడా డయాబెటిక్ పేషెంట్ అయితే ఆహారంలో మామిడి పొడిని చేర్చుకుంటే మంచిది. బరువు తగ్గాలంటే కచ్చితంగా మామిడి పొడిని ఆహారంలో చేర్చుకోండి. ఇది జీర్ణక్రియ ప్రక్రియకి తోడ్పడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయం చేస్తుంది. వాస్తవానికి ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

అలాగే వేసవి వచ్చేసింది. కాబట్టి మామిడిపండ్లు కూడా మార్కెట్‌లోకి రావడం మొదలవుతాయి. పండ్లలో రారాజు మామిడి. దీనిని ఇష్టపడని వారు ఉండరు. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నాయి. దీంతో వీటిని తినడం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగదు కానీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటివి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయ పడడమే కాదు మంచి ఎనర్జీని కూడా అందిస్తాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Chili Powder: ఒంట్లో వెటకారం ఎక్కువైనా పర్లేదు.. కారం ఎక్కువైతే మాత్రం ఖేల్ ఖతం

Health Tips: ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్..

Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!