Weight Loss Tips: ఈ 4 రోజువారీ అలవాట్లు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.. అవేంటంటే..

Weight Loss Tips: బరువు తగ్గడం అంత సులభం కాదు. శారీరక శ్రమ నుండి ఆరోగ్యకరమైన ఆహారం వరకు అనేక ఇతర విషయాలపై శ్రద్ధ వహించాలి.

Weight Loss Tips: ఈ 4 రోజువారీ అలవాట్లు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.. అవేంటంటే..
Follow us

|

Updated on: Jan 27, 2022 | 11:18 PM

Weight Loss Tips: బరువు తగ్గడం అంత సులభం కాదు. శారీరక శ్రమ నుండి ఆరోగ్యకరమైన ఆహారం వరకు అనేక ఇతర విషయాలపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బరువు తగ్గడానికి సంబంధించి చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. మన జీవన శైలి కూడా బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన రోజువారి అలవాట్లు బరువు తగ్గే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. అందుకే.. తినే ఆహారంతో పాటు, వ్యాయామం, రోజు వారి అలవాట్లను పరిశీలన చేసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కాలను పాటించవచ్చు. ఇందులో హైడ్రేటెడ్ గా ఉండటం, ఆహారాన్ని సరిగ్గా నమలడం వంటి అనేక అంశాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

నీరు త్రాగాలి.. నీరు తాగడం బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను పెంచడానికి నీరు సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ నీరు త్రాగటం వలన జీవక్రియ రేటు పెరుగుతుంది. నీరు తాగడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఫలితంగా ఆకలి అనిపించదు. ముఖ్యంగా ఉదయాన్నే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది.

ఆహారాన్ని బాగా నమలాలి.. మీరు తినే ఆహారాన్ని బాగా నమలాలి. అలా చేయడం వలన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. టీవీ చూస్తూ గానీ, ఇతర పనులు చేస్తూ గానీ తినకూడదు. అలా టీవీ చూస్తూ తింటే ఎక్కువగా తినేస్తారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

మంచిగా నిద్రపోవాలి.. సరిపడా గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర బరువు తగ్గడంలో అద్భుతంగా పని చేస్తుంది. వ్యక్తికి సరిగా నిద్ర లేనప్పుడు.. ఆహారం ఎక్కువగా తింటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా వారు బరువు పెరుగుతారట. నిద్ర లేకపోవడం వల్ల క్రమరహితమైన ఆకలి పెరిగి, బరువు కూడా పెరుగుతుందట. అందుకే సగటున 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువును చూసుకుంటూ ఉండాలి.. బరువు తగ్గే సమయంలో ప్రతి రోజూ తమ బరువును చెక్ చేసుకోవాలి. బరువు తగ్గేందుకు ఇది ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంపై నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందట.

Also read:

AP Corona: కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు..

Viral Video: మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి.. అతని రియాక్షన్ చూస్తే పగలబడి నవ్వుతారు..!

UP Assembly Election 2022: యూపీలో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!