Walking Benefits: నడకతో ఆరోగ్యం.. రోజూ అరగంట నడిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం..

Health Tips: ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించడానికి ప్రజలకు తగినంత సమయం లేదు. అలాంటి వారికి నడక మంచి ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. కాసేపటి

Walking Benefits: నడకతో ఆరోగ్యం.. రోజూ అరగంట నడిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం..
Walking

Health Tips: ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించడానికి ప్రజలకు తగినంత సమయం లేదు. అలాంటి వారికి నడక మంచి ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. కాసేపటి నడక వల్ల స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం కారణంగా చాలా మంది మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ ఆహారంలో నియంత్రణ, శారీరక శ్రమ అనేది క్రమం తప్పకుండా ఉంటే.. ఊబకాయం సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ఊబకాయం సమస్యతతో బాధపడుతున్న వారు రోజూ ఉదయం, సాయంత్రం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. రోజూ నడవడం వల్ల మీ శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయడంతోపాటు బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే ఉత్సాహం రెట్టింపవుతుంది. క్రమం తప్పకుండా ఓ అరగంట పాటు నడిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది..
ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ సమస్య వెంటాడుతోంది. బోలు ఎముకల వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే.. క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.

అధిక బీపీ నివారణ
హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. అధిక BP ఉన్నా, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినా ఖచ్చితంగా క్రమం తప్పకుండా నడవండి. దీంతో మీ BP, చెడు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

మధుమేహం నివారణ
మీరు డయాబెటిక్ పేషెంట్ అయినా.. లేదా ఈ సమస్య జన్యుపరంగా వచ్చినా నడిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నడక మధుమేహానికి ఔషధం. దీని వల్ల డయాబెటిక్ పేషెంట్లకు షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు ఏదైనా వ్యాధి కారణంగా లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి నడక రక్షిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈ రోజుల్లో ఒత్తిడి కూడా పెను సమస్యగా మారుతుంది. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కానీ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

Also Read:

Bizarre Incident: ఆ డీజే సౌండ్‌తో నా కోళ్లు చచ్చాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..

Click on your DTH Provider to Add TV9 Telugu