Walking: వాకింక్ చేసేందుకు బద్ధకిస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే వద్దన్నా ఆగరు..!

Walking Benefits: నడక మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా వారి పరిశోధన ప్రకారం..

Walking: వాకింక్ చేసేందుకు బద్ధకిస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే వద్దన్నా ఆగరు..!
Walking
Follow us

|

Updated on: Feb 21, 2022 | 9:14 PM

Health Tips: నడక ప్రాముఖ్యత గురించి మనం పెద్దగా ఆలోచించం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాయామాలలో ఒకటి. నడక(Walking) మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. దీంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. నడక వల్ల మన జీవితాన్ని సుదీర్ఘంగా, మెరుగ్గా మార్చే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.. నడక మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా వారి పరిశోధన ప్రకారం, నడక పెద్దవారిలో డిమెన్షియా, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. నడక ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనితో పాటు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా నడకకు దూరంగా ఉంటాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, వారానికి కేవలం రెండున్నర గంటలు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుంది.

3. ఒత్తిడిని తగ్గిస్తుంది.. రోజుకు కొన్ని నిమిషాలు నడవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రకృతిలో నడకకు వెళ్లినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నడక మీ కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. దీంతో ఒత్తిడి కూడా తక్కువే.

4. మంచి నిద్రకు మేలు చేస్తుంది.. నడక మన శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనితో పాటు, ఇది నిద్ర సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, 50 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతిరోజూ కొంత సమయం పాటు నడవడం వల్ల నిద్రకు ఇబ్బంది ఉండదు.

5. నడక మంచి వ్యాయామం.. నడకను కేవలం చిన్న వ్యాయామంగా భావించడం తప్పు. బ్రిస్క్ వాకింగ్ మీ మొత్తం శరీరానికి చక్కని వ్యాయామాన్ని అందిస్తుంది. నడకను అధిక-తీవ్రత కలిగిన వ్యాయామంగా మార్చడానికి, మీరు భారీ బ్యాగ్‌తో నడవవచ్చు.

6. నడక సంబంధాలను మెరుగుపరుస్తుంది.. మీ భాగస్వామి లేదా పిల్లలతో కలిసి నడవడం వల్ల మీ సంక్లిష్ట సంబంధాలను పరిష్కరించుకోవచ్చు. కలిసి నడుస్తున్నప్పుడు, మీరు మీ మనసులో మాటలు మాట్లాడటం ద్వారా మీ సంబంధంలో కమ్యూనికేషన్‌ను పెంచుకోవచ్చు. ప్రతిరోజూ తమ ఇంటి చుట్టూ తిరిగే వ్యక్తులు, వారి సామాజిక సంబంధాలు కూడా చాలా మంచివని అనేక పరిశోధనలలో వెల్లడైంది.

7. ఎక్కడైనా, ఎప్పుడైనా నడివొచ్చు.. జిమ్ లాగా, నడవడానికి సభ్యత్వం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఒక రోజులో 30 నిమిషాల నడక చేయవచ్చు. ఉదాహరణకు, పని తర్వాత 10 నిమిషాల నడక, భోజనం తర్వాత 10 నిమిషాల నడక, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు 10 నిమిషాల నడక ఎంతో చక్కని వ్యాయామంగా మారుతుంది.

8. రోజుకు 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదు.. రోజుకు 10,000 అడుగులు వేయాలని చాలా మంది అంటుంటారు. కానీ, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన ప్రకారం, ఇది అవసరం లేదు. 2019లో జరిగిన ఈ పరిశోధన ప్రకారం రోజూ 4-8 వేల అడుగులు నడవడం వల్ల మరణాల ముప్పు తగ్గుతుంది.

Also Read: Weight Loss Salad: వేగంగా బరువు తగ్గాలంటే.. ఈ సలాడ్‌ని మీ డైట్‌లో చేర్చాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే?

Diet Tips: ఉడకబెట్టిన గుడ్డుతోపాటు వీటిని తీసుకుంటున్నారా.. అయితే ఈ 5 వ్యాధుల బారిన పడే ఛాన్స్..!

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..