Winter Skin Care: చలికి చర్మం పగిలిపోతోందా.. శీతల గాలుల్లో మీ ముఖం బిగిసిపోకూడదంటే ఇలా చేసి చూడండి

చలికాలం(Winter)లో చర్మం కాంతివంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ సీజన్ లో చర్మం(Skin) పోడిబారిపోతుంది. దీంతో చర్మం అంతా పగిలినట్టుగా అయిపోయి.. తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తుంది. 

Winter Skin Care: చలికి చర్మం పగిలిపోతోందా.. శీతల గాలుల్లో మీ ముఖం బిగిసిపోకూడదంటే ఇలా చేసి చూడండి
Skin Care In Winter

చలికాలం(Winter)లో చర్మం కాంతివంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ సీజన్ లో చర్మం(Skin) పోడిబారిపోతుంది. దీంతో చర్మం అంతా పగిలినట్టుగా అయిపోయి.. తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తుంది.  శీతల గాలులు ఎక్కువ అయ్యే కొద్దీ చర్మం పగలడం వలన మంటలు పుడతాయి. అందువల్ల శీతాకాలంలో చర్మం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.  శీతాకాలం చర్మాన్ని సహజంగా మెరిసేలా ఉండేలా చేసుకోవడానికి సహజ పద్ధతులు చలా మేలు చేస్తాయి. ఇంటిలో సులభంగా లభించే పదార్ధాలతో మన చర్మాన్ని చలికాలంలో సురక్షితంగా ఉంచుకోవచ్చు.  యాపిల్ నుంచి టమోటా వరకూ రకరకాల పళ్ళు.. కాయగూరలు.. మన చర్మాన్ని నిగానిగాలాడేలా ఉంచడంలో సహాయపడతాయి. వాటి సహాయంతో చర్మం పగిలిపోకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ సీజన్‌లో మీకు ప్రభావవంతంగా ఉండగల కొన్ని సులభమైన ఇంటి నివారణ(Home Remedies)లను తెలుసుకుందాం.

  1. యాపిల్ చర్మంలోని సహజ నూనెను నియంత్రిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ రెమెడీ ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్ ముక్కలను పేస్ట్ లా చేసి ముఖంపై పలుచని పొరలా రాయండి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.
  2. టొమాటోలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. దీని వాడకంతో చర్మంలోని మచ్చలు కూడా క్రమంగా తగ్గుతాయి.  టొమాటో రసం, నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. చేతులు నోరు కడుక్కున్న తర్వాత, ఈ మిశ్రమంతో చర్మాన్ని మసాజ్ చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  3. అరటిపండు ఇది చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తొలగిస్తుంది. పండిన అరటిపండును మెత్తగా చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గ్లో .. బిగుతుగా కనిపించడం ప్రారంభమవుతుంది.
  4. స్ట్రాబెర్రీ ఇది డల్ చర్మానికి దివ్యత్వాన్ని ఇస్తుంది. తాజా స్ట్రాబెర్రీలను కొద్దిగా వెన్నలో గ్రైండ్ చేసి కలపాలి. పలుచని పేస్ట్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం చాలా మృదువుగా మారుతుంది.
  5. చర్మం ముడతలను పోగొట్టడంలో తేనె చాలా సహాయపడుతుంది. ఇది పొడి చర్మాన్ని మృదువుగా.. మెరిసేలా చేస్తుంది. ముఖానికి పలుచని తేనెను రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీళ్లలో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవారు తేనెలో 4-5 చుక్కల నిమ్మరసం కలుపుకోవచ్చు.
  6. వేప చర్మాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీని ఉపయోగం మొటిమలను నయం చేయడంలో సహాయపడుతుంది. వేప ఆకులను గ్రైండ్ చేసి ముల్తానీ మిట్టితో కలిపి ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేయండి.
  7. జిడ్డు చర్మాన్ని సాధారణంగా ఉంచడానికి.. మెరిసే చర్మాన్ని మెరుగుపరచడానికి దోసకాయ రసం మంచిదని భావిస్తారు. దోసకాయ రసం తీసి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. అంతే కాకుండా దోసకాయ ముక్కలను పాలలో మరిగించి రుబ్బుకోవాలి. ఈ మాస్క్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని బిగుతుగా మార్చే గొప్ప మాస్క్ ఇది.

ఇక్కడ సూచించిన విధానాలు వివిధ సందర్భాల్లో నిపుణులు చెప్పిన విషయాల ఆధారంగా అందించినవి. మీరు ఏదైనా ప్రయత్నం చేసే ముందు మీ ఆరోగ్య విషయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి: ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు.. నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు..

Skylab: ఓటీటీలో అలరించనున్న స్కైలాబ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu