Diabetes Symptoms: పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. డయాబెటిస్‌ కావొచ్చు..

Diabetes Symptoms: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి...

Diabetes Symptoms: పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. డయాబెటిస్‌ కావొచ్చు..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2021 | 6:40 AM

Diabetes Symptoms: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే డయాబెటిస్‌ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తగిన చర్యలు తీసుకుంటే వ్యాధి ఎక్కువ కాకుండా కంట్రోల్‌ చేసుకుకే అవకాశం ఉంటుంది. అయితే షుగర్‌ వ్యాధి వచ్చే ముందు పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీనిబట్టి మొదటి స్టేజ్‌లోనే గుర్తించే అవకాశం లభిస్తుంది. ఇంతకీ షుగర్‌ వ్యాధి వచ్చే ముందు పాదాల్లో కనిపించే లక్షణాలు ఏంటో.? తెలుసుకుందాం..

* కొందరికి పాదాల్లో చలనం అనిపించదు. ముఖ్యంగా గాయాలు అయిన సందర్భంలో ఏమాత్రం నొప్పిగా అనిపించదు. మీకూ ఇలాంటి లక్షణమే కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది షుగర్‌కు ఆరంభ లక్షణంగా చెప్పవచ్చు.

* డయాబెటిస్‌ వ్యాధిన బారిన పడేవారిలో రక్తం సరఫరా సరిగ్గా జరగదు. పాదాల్లో రక్త ప్రసరణ తగ్గడంతో నడుస్తున్నప్పుడు పాదాల్లో నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ లక్షణం కనిపించగానే జాగ్రత్త పడాలి.

* పాదాల్లో నిత్యం తిమ్మిర్లు వస్తున్నా, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తున్నా అది షుగర్‌ వ్యాధికి సూచన అని అంచనాకు రావాలి. ఈ లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి.

* డయాబెటిస్‌తో బాధపడేవారికి గాయాలు త్వరగా తగ్గవనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కాళ్లకు అయిన గాయాలు తగ్గవు. పుండ్లు కూడా మానేందుకు సమయం పడుతుంది. పాదాల్లో అయ్యే గాయాలు కూడా త్వరగా మానవు ఈ లక్షణం కూడా డయాబెటిస్‌కు సూచనగా చెప్పవచ్చు.

పైన పేర్కొన్న వాటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే అలర్ట్‌ అయి వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలను నిర్వహించి డయాబెటిస్‌ ఉంటే త్వరగా చికిత్స ప్రారంభిస్తే వ్యాధి త్వరలోనే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: Myopia: ఈ సరికొత్త కంటి అద్దాలు మయోపియాను దూరం చేస్తాయి..ఎలాగంటే..

Health Tips: ఎండిన కొబ్బరి తింటే గుండె సమస్యలు ఫసక్.. బోలెడన్నీ ప్రయోజనాలు మీరు తెలుసుకోండి..

Aloo Tikki Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా ‘ఆలూ టిక్కా’ తయారీ మీకోసం..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ