Health: లంగ్‌ క్యాన్సర్‌ను ముందుగానే ఇలా గుర్తించవచ్చు.. ఈ లక్షణాలే దానికి సూచన..

Health: మనిషి ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా తినేసే మాయదారి రోగం క్యాన్సర్‌. శరవేగంగా ఒళ్లంతా వ్యాపిస్తూ.. అమాంతం మనిషి ప్రాణాన్నే హరిస్తుంది. ఇక క్యాన్సర్‌లలో చాలా రకాలు ఉంటాయనే...

Health: లంగ్‌ క్యాన్సర్‌ను ముందుగానే ఇలా గుర్తించవచ్చు.. ఈ లక్షణాలే దానికి సూచన..
Lung Cancer

Health: మనిషి ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా తినేసే మాయదారి రోగం క్యాన్సర్‌. శరవేగంగా ఒళ్లంతా వ్యాపిస్తూ.. అమాంతం మనిషి ప్రాణాన్నే హరిస్తుంది. ఇక క్యాన్సర్‌లలో చాలా రకాలు ఉంటాయనే విషయం తెలిసిందే. వీటిలో లంగ్‌ క్యాన్సర్‌ ఒకటి. అయితే క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తిస్తే సరైన చికిత్స చేయించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతూనే ఉంటారు. ఫస్ట్‌ స్టేజ్‌లో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స కూడా చాలా సులభంగా ఉంటుంది. లంగ్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తింవచ్చనే విషయం మీకు తెలుసా.? కొన్ని లక్షణాల ద్వారా లంగ్‌ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* సాధారణంగా ఏ క్యాన్సర్‌ వచ్చిన వారిలోనైనా ప్రధానంగా కనిపించే లక్షణం బరువు తగ్గడం. క్యాన్సర్‌ కణాలు శర వేగంగా పెరుగుతుంటాయి. దీనివల్ల సెడన్‌గా బరువు తగ్గుతారు. ఒకవేళ అనుకోకుండా బరువు తగ్గితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకోవడం మంచిది. ఒకవేళ క్యాన్సర్‌గా తేలితే సింపుల్‌గా జయించవచ్చు.

* లంగ్‌ క్యాన్సర్‌ సోకిన వారిలో ప్రారంభంలోనే శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. అయితే కొందరిలో ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ.. ఎడతెరపి లేకుండా ఇదే ఇబ్బంది ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే.

* ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడిన వారికి భుజాలు, ఛాతి, వెన్నెముక భాగాల్లో నొప్పులు ఉంటాయి. అయితే ఈ నొప్పులు కూడా కొన్ని సందర్భాల్లో సహజంగా కనిపించినా ధీర్ఘకాలికంగా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే.

* ఇక లంగ్‌ క్యాన్సర్‌ సోకిన వారికి కనిపించే మరో ప్రధాన లక్షణం దగ్గు. 3 వారాలకి పైగా నిరంతరాయంగా దగ్గు ఉంటే కచ్చితంగా అనుమానించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకిన వారిలో ప్రారంభంలో గొంతు మారడాన్ని గమనించవచ్చు. మాట్లాడే సమయంలో వాయిస్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఒకవేళ ఉన్నపలంగా గొంతులో మార్పు కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్‌ కావాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

Also Read: Wedding Viral Video: వెడ్డింగ్‌ పార్టీలో షాకింగ్‌ సంఘటన తలలు పట్టుకున్న అతిధులు నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

గోమాతకు శ్రీమంతం.. ఒకే గ్రామంలో పుట్టింటి వర్గం అత్తింటి వర్గంగా మారి జరిపించిన వేడుక..(వీడియో)

Watch Video: శ్రేయాస్‌ అయ్యర్ దెబ్బకు పారిపోయిన భారత పేస్ బౌలర్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu