Sugar Myths : పంచదార ఎక్కువ తింటే షుగర్ వస్తుందా? డయాబెటిస్ పై ఉన్న అపోహలేంటో మీకు తెలుసా?

బ్లడ్ షుగర్ అధికంగా ఉండడం వల్ల అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కళ్లు, మూత్రపిండాలు వంటి వ్యాధుల తీవ్రతకు మధుమేహం కారణమవుతుంది. అయితే మధుమేహం నియంత్రణ విషయంలో చాలా మంది కొన్ని నమ్మకాలు పెంచుకుంటారు.

Sugar Myths : పంచదార ఎక్కువ తింటే షుగర్ వస్తుందా? డయాబెటిస్ పై ఉన్న అపోహలేంటో మీకు తెలుసా?
Sugar Control Tips High Sugar Low Sugar Tips
Follow us

| Edited By: Basha Shek

Updated on: Dec 18, 2022 | 2:25 PM

డయాబెటిస్ లేదా మధుమేహం. ప్రస్తుత రోజుల్లో అందరిని వేధించే సమస్య. బ్లడ్ షుగర్ అధికంగా ఉండడం వల్ల అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కళ్లు, మూత్రపిండాలు వంటి వ్యాధుల తీవ్రతకు మధుమేహం కారణమవుతుంది. అయితే మధుమేహం నియంత్రణ విషయంలో చాలా మంది కొన్ని నమ్మకాలు పెంచుకుంటారు. కొన్ని రకాల ఆహారాలే తినాలని, వేరేవి తింటే షుగర్ వ్యాధి తీవ్రం అవుతుందని అనుకుంటుంటారు. అయితే అవన్నీ అపోహలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా షుగర్ వ్యాధిపై ప్రజలు పెంచుకునే అపోహలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ సమస్య తీవ్రమైనది కాదు..పెద్దగా పట్టించుకోవక్కర్లేదా? 

సాధారణంగా పెద్ద వయస్సు ఉన్న వారికి మధుమేహం వస్తే దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదని, మందులు కూడా వాడక్కర్లేదని చెబుతుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని మధుమేహం అనేది జీవన శైలి వ్యాధి అని దానికి సత్వర నిర్వహణ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. షుగర్ కు మందులు వాడకపోతే గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

పంచదార తింటే షుగర్ వస్తుందా? 

చాలా మంది పంచదార తింటే షుగర్ వస్తుందని భయపడుతుంటారు. అయితే నిపుణులు మాత్రం జన్యు శాస్త్రం ప్రకారం పేలవమైన ఆహార అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఊబకాయం వంటి సమస్యల కారణంగానే షుగర్ వస్తుందని చెబుతున్నారు. కానీ చక్కెర పానియాలకు మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 ఇన్సులిన్ వాడితే వ్యాయామం చేయక్కర్లేదా?

చాలా మంది షుగర్ పేషెంట్లు ఇన్సులిన్ వాడితే శారీరక వ్యాయామం చేయక్కర్లేదు అని అనుకుంటారు. షుగర్ మందులు ప్రభావవంతంగా పని చేయనప్పుడు వైద్యులు ఇన్సులిన్ సూచిస్తారు. దాన్ని కారణంగా చూపి వ్యాయామాాలకు దూరంగా ఉండకూడదని, కచ్చితంగా శారీరక వ్యాయామం ఉండాలని చెబుతున్నారు. 

మధుమేహం ఉంటే స్త్రీలకు గర్భం రాదా?

జనబాహుల్యంలో మధుమేహ ఉన్న స్త్రీలు  గర్భం దాల్చలేరని అనుకుంటుంటారు. కానీ వైద్యులు మాత్రం అది అపోహ మాత్రమేనని వారు కూడా గర్భం దాల్చి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని పేర్కొంటున్నారు. 

షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయకూడదా? 

చక్కెర లోని స్థాయిలను ప్రతిరోజూ నియంత్రించడానికి రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇన్సులిన్ ఉత్పత్తికి, శరీర సున్నితత్వాన్ని పెంచడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు వారానికి కనీసం ఐదు రోజులు, రోజూ ఓ గంట సేపు వ్యాయామం చేయడం మంచిది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!