Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు రోజు వ్యాయమాలు చేయడం ఎంతో మంచిది. మంచి ప్రొటీన్స్ ఉన్న ఆహారంతో పాటు రోజు వారిగా వ్యాయమాలు చేస్తుంటే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఇక ప్రాణాయామం ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా ఉజ్జయి ప్రాణాయామాన్ని సాధన చేస్తే శ్వాస నెమ్మదించి నాడీ శుద్ది జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉజ్జయి అంటే ఏమిటి..?
ఉజ్ అంటే పైకి కదలడం, జయి అంటే విజయం సాధించడం. ఉజ్జయి అంటే స్థూలంగా విజయవంతం అని అర్థం. ఉజ్జయి ప్రాణాయామం అంటే విజయవంతమైన శ్వాస అని అర్థం. ఓషన్ బ్రీత్ ఉజ్జయి ప్రాణయామం ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడానికంటే ముందే గాలిని వెచ్చబరుస్తుంది. ఫలితంగా శరీరంలో వేడి జనించి, టాక్సిన్లు విసర్జితమవుతాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస పీల్చుకోవడం, వదలడం నాశికా రంథ్రాల ద్వారానే జరుగుతుంది. గాలిని నేరుగా గొంతు లోపలికి పీల్చుకోవడం కారణంగా ఆ ప్రదేశంలో కండరాలు కుంచించుకుని ఓ శబ్దం వెలువడుతుంది. ఈ శ్వాసను ఓషన్ బ్రీత్ అని కూడా అంటారు
ఆరోగ్య ప్రయోజనాలు
ఉజ్జయి ప్రాణాయామంతో శ్వాస వేగం నెమ్మదిస్తుంది కాబట్టి, ఆయుష్షు పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఈ ప్రాణాయామంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో శక్తి మార్గాలైన నాడులు శుద్ధి అవుతాయి. ఇక మానసిక ఏకాగ్రత, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. సైనస్ ఒత్తిడి దూరం అవుతుంది. తలనొప్పులు తగ్గి జీర్ణ, నాడీ వ్యవస్థలు బలపడతాయి. ఉజ్జయి ప్రాణాయామం రోజుకు 10 నుంచి 12 నిమిషాల పాటు సాధనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాణాయామం ఎలాంటి వారు చేయకూడదు:
ఈ ప్రాణాయామం గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ ప్రాణాయామంలో బంధ, శ్వాస నిలిపి ఉంచడం లాంటివి కలిపి సాధన చేయకూడదు. తల తిరిగితే, సాధనను ఆపి, మామూలుగా గాలి పీల్చుకోవాలి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు గొంతును బిగపట్టకూడదు. పీల్చుకునే గాలి మోతాదును ఎటువంటి పరిస్థితుల్లోనూ బలవంతంగా అవసరానికి మించి పెంచకూడదు.
ఇవి కూడా చదవండి: