Health Tips: యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ప్రతిరోజు దీనిని తీసుకోండి..!

Health Tips: కొంతమంది శరీరంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు కప్పు కాఫీ తాగితే చాలా ఉపశమనం ఉంటుంది. దీనివల్ల కిడ్నీలు

Health Tips: యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ప్రతిరోజు దీనిని తీసుకోండి..!
Uric Acid
Follow us

|

Updated on: Mar 15, 2022 | 5:41 AM

Health Tips: కొంతమంది శరీరంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు కప్పు కాఫీ తాగితే చాలా ఉపశమనం ఉంటుంది. దీనివల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. యూరిక్ యాసిడ్ కంట్లోల్‌లో ఉంటుంది. అంతే కాకుండా బీట్‌రూట్ తాగడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అయితే శరీరంలొ యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందో దానిని ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం.. మూత్రపిండాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను సరిగ్గా తొలగించలేనప్పుడు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. ఇది ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, దృఢత్వం, వాపు, కదలడంలో ఇబ్బంది, కీళ్ల ఆకారం మారడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో కాఫీ తాగితే మంచిది. దీంతోపాటు బీట్‌రూట్ కూడా తినవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ బయటకు వస్తుందని చెబుతారు. మీరు ఆహారంలో నారింజ రసాన్ని కూడా చేర్చుకోవచ్చు. దీనిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంతో పాటు కడుపు సమస్యలు కూడా తొలగిపోతాయి.

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సమయపాలన లేని ఆహార అలవాట్లు, నిద్ర అతిపెద్ద కారణం. రెడ్ మీట్, సీఫుడ్, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, పనీర్, రైస్, ఆల్కహాల్ మొదలైన వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్స్ ఉంటాయి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్యూరిన్ మొత్తం పెరుగుతుంది. మూత్రపిండాలు వీటిని క్లీన్ చేయలేకపోతాయి. అటువంటి పరిస్థితిలో దాని స్థాయి శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా కొన్నిసార్లు వంశపారంపర్యత, అధిక బరువు, అధిక ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!

Health Tips: ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్..

Onions Side Effects: నిత్యం ఉల్లి లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ సమస్యలున్నవారు తింటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..