Diabetes Health: మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా.. షుగర్ అదుపులో ఉండాలంటే తిన్న తర్వాత ఈ చిన్న పని చేయండి..

మధుమేహానికి చాలా విషయాలు కారణమవుతాయి. మెడిసిన్ తీసుకోకుండా మధుమేహాన్ని నియంత్రించడం కష్టం. కానీ మీరు మీ దినచర్యలో ఒక చిన్న పనిని చేర్చుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

Diabetes Health: మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా.. షుగర్ అదుపులో ఉండాలంటే తిన్న తర్వాత ఈ చిన్న పని చేయండి..
Diabetes
Follow us

|

Updated on: Sep 04, 2022 | 10:01 AM

శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం సమస్య వస్తుంది. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.. కానీ తక్కువ చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి.. మందులు తీసుకోవడం.. ఒత్తిడికి దూరంగా ఉండటం.. ఆహారాన్ని నియంత్రించడం అవసరం. అయితే.. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. షుగర్ సమస్య ఉంటే దాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది. అయితే రోజూ కొంత సేపు నడవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఆహారం తిన్న తర్వాత 5 నిమిషాలు నడిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.

మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? 

కార్బోహైడ్రేట్లు ఆహారంలో గణనీయమైన మొత్తంలో కనిపిస్తాయి. కాబట్టి ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తరచుగా పెరుగుతుంది. మనం ఏదైనా తిన్న తర్వాత కూర్చుంటే కార్బోహైడ్రేట్ల నుంచి తయారయ్యే శక్తి శరీరంలో ఉపయోగించబడదు. చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఆహారం తిన్న తర్వాత కొంత సమయం పాటు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే మన శరీరం గ్లూకోజ్‌ని ఉపయోగిస్తుంది. శరీరంలో చక్కెర స్తాయి కంట్రోల్‌లో ఉంటుంది.

ఆహారం కూడా చాలా ముఖ్యం

శారీరక వ్యాయామంతో పాటు.. మనం తీసుకునే ఆహారం కూడా మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుతుంది. మనం ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే అది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరంగా మారుతుంది. మధుమేహం విషయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే.. మీరు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని తినకూడదు. పుచ్చకాయ, ద్రాక్ష, పండిన అరటి వంటి పండ్లు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అటువంటి పండ్లను అస్సలు తినకండి. బియ్యం, బంగాళదుంపలు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, బ్రెడ్‌తో చేసినవాటిని కూడా తినకూడదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కివి, రేగు పండ్లను తినడం మంచిది. మీకు మధుమేహం ఉంటే, తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేయాలి. మీరు స్వీట్లను ఎక్కువగా ఇష్టపడితే.. మీరు కేలరీలు లేనటువంటి చక్కెర వస్తువులను తీసుకోవచ్చు. డయాబెటిస్‌ ఉన్నవారు ఎక్కువ ఆయిల్, స్పైసీ తినడం మానేయాలి. ఇలాంటి కొన్ని హోం రెమెడీలను పాటించడం చాలా అవసరం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్