Health Care Tips: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? అయితే, ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!

Health Care Tips: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. గోళ్లు కొరకడం వల్ల చేతుల అందం పాడవడమే కాకుండా ఆరోగ్యానికి ..

Health Care Tips: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? అయితే, ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!
Nails
Follow us

|

Updated on: Jul 02, 2022 | 10:38 PM

Health Care Tips: మీకు గోళ్లు కొరికే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. గోళ్లు కొరకడం వల్ల చేతుల అందం పాడవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. గోర్లు మానవ శరీరంలో ముఖ్యమైన భాగం అనే విషయం తెలిసిందే. నెయిల్స్ సాధారణ, క్లిష్టమైన రోజువారీ పనులను చేయడానికి ఉపకరిస్తాయి. అదే గోర్లతో అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. గోర్లు మన ఆరోగ్య పరిస్థితిని కూడా చెప్పే్స్తాయి. ఐరన్ లోపం, థైరాయిడ్, రేనాడ్స్ సిండ్రోమ్, మందుల వినియోగం వల్ల గోర్లు ఊడిపోతుంటాయి.

మీ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? చేతులు, గోళ్లను క్లాత్‌తో కప్పి ఉంచాలి. మాయిశ్చరైజ్ చేయండి. మంచి నాణ్యమైన నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. గోర్లు కొరకకండి. చాలా మంది మహిళలు గోళ్లను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు అయితే, వాటిని నిర్వహించడంలో విఫలమవుతుంటారు. గోర్లను కొరికే అలవాటును పెంచుకుంటారు.

గోరు కొరకడానికి కారణమేంటి? గోర్లు కొరకడానికి మానసిక వ్యాధి లేదా ఇతర వ్యసనం కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, గోర్లు కొరికే అలవాటును మానుకోవడం చాలా ఈజీగా అని చెబుతున్నారు. గోళ్లను చిన్నగా కత్తిరించాలి. ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇదే సరైన మార్గం. కొంత కాలం ఇబ్బందిగా ఉన్నా.. రాను రాను మంచే జరుగుతుంది. గోర్లు కొరకడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోట్లోకి వెళ్లి.. ఇతర జబ్బులకు కారణం అవుతుంది. అందుకని గోళ్లు కొరకడం మానేయడం ఉత్తమం. అయితే, గోళ్లను పెంచుకోవాలనుకునే వారు.. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..