Dark neck: నల్లని మెడతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిన్ని చిట్కాతో మొత్తం మార్చేయోచ్చు.. ఏం చేయాలంటే..

Alum Use: మీ మెడపై నల్లగా మచ్చ ఏర్పడిందా..? ఎలాంటి ప్రయత్నాలు చేసిన పోవడం లేదా..? అయితే ఈ చిన్న చిట్కాతో ఏళ్లుగా ఏర్పడిన మచ్చ మాయం అవడం ఖాయం.

Dark neck: నల్లని మెడతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిన్ని చిట్కాతో మొత్తం మార్చేయోచ్చు.. ఏం చేయాలంటే..
Dark Neck
Follow us

|

Updated on: Sep 20, 2022 | 5:05 PM

వేసవి కాలంలో చర్మం తరచుగా టాన్ అవుతుంది. కానీ కొందరికి కాలంతో సంబంధం లేకుండా మెడపై నల్లా ఏర్పడుతుంది. మెడ నల్లగా ఉన్న తర్వాత చాలా విచిత్రంగా కనిపిస్తుంది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఆ నలుపు అస్సలు వదిలించుకోవడం చాలా కష్టం. మీరు కూడా ఇలాంటి నల్లని మచ్చతో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని హోం రెమెడీస్‌తో పరిష్కరించుకోవచ్చు. వీటిని పాటించడం ద్వారా మీరు కొన్ని రోజుల్లో నల్లని మెడను వదిలించుకోవచ్చు.

పటికతో నల్లని మెడకు చెక్..

మెడ నలుపును పోగొట్టడానికి (క్లీన్ డార్క్ నెక్) ఒక చెంచా పటిక పొడిని తీసుకుని అందులో సమాన పరిమాణంలో ముల్తానీ మిట్టి కలపాలి. దీని తరువాత, 1 టీస్పూన్ రోజ్ వాటర్, 1-2 టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ సిద్ధం చేయండి. దీని తరువాత, ఈ పేస్ట్‌ను నల్ల మెడ, శరీరంలోని ఇతర భాగాలపై బాగా రాయండి. పేస్ట్ అప్లై చేసిన తర్వాత 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి బాగా ఆరనివ్వాలి.

ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి

పటిక, ముల్తానీ మిట్టి పేస్ట్ అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. అయితే, ఈ సమయంలో సబ్బును అస్సలు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. మెడ కడగడానికి నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఎలాంటి క్రీములు, రసాయనాలు, పౌండర్లు వాడకూడదు.

వారానికి 3-4 సార్లు క్రమం తప్పకుండా..

మెడ నలుపును తొలగించడానికి.. మీరు ఈ రెమెడీని వారానికి 3-4 సార్లు క్రమం తప్పకుండా చేయాలి. అయితే మరింత అద్భుతమైన ఫలితాల కోసం నిద్రపోయే ముందు దీన్ని ఉపయోగించండి. దీంతో మెడలోని నలుపు త్వరగా తొలగిపోతుంది.

బేకింగ్ సోడా, రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు

పటిక, ముల్తానీ మిట్టి పేస్ట్ కాకుండా.. మీరు నల్లటి మెడపై మచ్చను తొలిగించుకునేందుకు.. పటిక, బేకింగ్ సోడా, రోజ్ వాటర్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది మెడలోని నలుపును సులభంగా పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం