ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్ అంట… తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..

| Edited By: Shaik Madar Saheb

Nov 23, 2024 | 4:06 PM

మనిషి నిద్రపోవడంలో, నిద్రను ప్రభావితం చేయడంలో మన హార్మోన్లు.. టెస్టోస్టెరాన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యాయం ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా..

ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్ అంట... తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
Men and women sleep study
Follow us on

మనిషి నిద్రపోవడంలో, నిద్రను ప్రభావితం చేయడంలో మన హార్మోన్లు.. టెస్టోస్టెరాన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యాయం ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా.. కొన్ని తేడాలు గమనించిన పరిశోధకులు.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని వెల్లడించింది. పురుషులు.. మహిళలు ఇద్దరి మధ్య నిద్ర వ్యత్యాసాలు వారి వ్యక్తిగత ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావాలను కలిగి ఉంటాయనిది ఈ పరిశోధన సారాంశం.

ఈ అధ్యాయంలో పాల్గొన్న పరిశోధకుల రిపోర్ట్ ప్రకారం.. పురుషులు.. మహిళలు ఇద్దరూ వేరువేరు నిద్ర విధానాలను కలిగి ఉంటారు. జంతువులలో నిద్ర విధానాలను పరిశోధన చేయటం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళలలో నిద్ర గురించి పరిశోధన నిర్వహించారు.. ఇది మానవ ఆరోగ్యం పై ఎలా ప్రభావాన్ని చూపుతుందో పరిశోధించడం వీరి ఉద్దేశం. మధుమేహం ఊబకాయం అల్జీమర్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నిద్రని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఈ తాజా అధ్యయనంలో కదలికలను గుర్తించడానికి ఆల్ట్రా సెన్సిటివ్ సెన్సార్లతో ప్రత్యేక బోనులలో 267 ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు. 24 గంటల సమయంలో మగ ఎలుకలు దాదాపు 670 నిమిషాల పాటు నిద్రపోతే.. ఆడ ఎలుకలు గంట తక్కువ నిద్రపోయాయని వీరు గుర్తించారు. ఆడవారిలో హార్మోన్ల మార్పులు, ఆడవారి హార్మోన్లు నెలవారీగా, జీవితాంతం మారుతూ ఉంటాయి. ఈ మార్పులు నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల ఎక్కువగా నిద్ర పోవడం జరగడం లేదని పరిశోధన రిపోర్ట్. మహిళలు వారి పీరియడ్ టైం లో నిద్రపోవడం లో డిస్టబెన్స్ ను మనం గమనించవచ్చని వివరించింది.

ఆడవారికి నెలసరి సమయంలో, గర్భం దాల్చిన తర్వాత, తల్లిపాలు ఇవ్వడం.. రుతుక్రమం ఆగిపోయిన సమయంలో సంభవించే హార్మోన్ మార్పుల వల్ల నిద్ర కు ఇబ్బంది అవుతుంది.. వీటివల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది.. ఈ సమయాల్లో, మహిళలు నిద్రకు భంగం కలిగించే తిమ్మిరి,చెమటల తో కొంత అసౌకర్య శారీరక లక్షణాలను అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటి కారణాలతో ఆడవారు జీవితంలోని ఈ దశలలో నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి కొన్ని నిద్ర రుగ్మతలతో బాధపడతారని అధ్యయనంలో తెలిపింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..