Beauty Tips: వయసు పెరిగినా అందంగా కనిపించాలంటే.. మీ డైట్‌లో ఈ ఆహారాన్ని చేర్చుకోండి

లబై ఏళ్ల వయసు దాటారంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. కొందరికి కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడుతాయి. మీరు ఈ వయస్సు ప్రభావాన్ని

Beauty Tips: వయసు పెరిగినా అందంగా కనిపించాలంటే.. మీ డైట్‌లో ఈ ఆహారాన్ని చేర్చుకోండి
Beauty Tips
Follow us

|

Updated on: Nov 16, 2022 | 5:54 PM

వయసు పెరిగేకొద్ది.. మనిషి సౌందర్యం తగ్గుతుంది. యవ్వనంలో ఉన్నట్లు వృద్దాప్యంలో ఉండలేరు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు వస్తుంటాయి. కొంతమంది తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు అనేక రకాల క్రీములను, మరికొంతమంది సహజమైన పదార్థాలను వాడుతూ ఉంటారు. ఫలితం మాత్రం అందరికీ ఒకేలా ఉండదు. వయసు పెరిగినా కొంతమంది మాత్రం ఎంతో అందంగా కనిపిస్తుంటారు. వారిని చూసి కొన్ని సందర్భాల్లో వయసును అంచనావేయలేం. సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే సరైన ఫలితం దక్కుతుంది.  నలబై ఏళ్ల వయసు దాటారంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. కొందరికి కళ్ల చుట్టూ ముడతలు ఏర్పడుతాయి. మీరు ఈ వయస్సు ప్రభావాన్ని తొలగించాలనుకుంటే కొన్ని ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. తద్వారా చర్మం సహజమైన మెరుపును పొందుతుంది. వయస్సు ప్రభావాన్ని తగ్గించే  ఐదు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజూ కనీసం రెండు మూడు సార్లు టీకి బదులు గ్రీన్ టీ తాగాలి. అయితే టీ, కాఫీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. గ్రీన్ టీలో చక్కెర లేదా పాలు ఉపయోగించవద్దు.

టమోటా

టమోటాలలో లైకోపీన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. నిత్యం టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఒమేగా-3 రిచ్ ఫుడ్

వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్, సోయాబీన్, క్యాలీఫ్లవర్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, గుడ్లు మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతల సమస్యను తొలగించి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు.

మొలకెత్తిన ధాన్యాలు

శనగలు, గోధుమలు, సోయాబీన్ మొదలైన వాటిని మొలకెత్తిన తర్వాత రోజూ తినాలి. ఈ ఆహారాలు మీ శరీరంలోని ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాల లోపాన్ని తొలగిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం తాజాగా ఉంటుంది.

నీరు

నీరు మీకు సాధారణ విషయంగా అనిపించవచ్చు కానీ మీ శరీరం, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్‌ ఎలిమెంట్స్ బయటకు రావడం వల్ల చర్మంపై మెరుపు వస్తుంది. శరీరం అన్ని రోగాలకి దూరంగా ఉంటుంది. చర్మం లోపల నుంచి గ్లో తీసుకొస్తుంది.

నోట్: ఈ వార్తలోని అంశాలు సమాచారం కోసం మాత్రమే.. మరిన్ని సందేహల నివృత్తి కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్