Heart Attack: బ్రష్ సరిగా చేసుకోకపోతే గుండె జబ్బులు వస్తాయా..! నిపుణులు ఏం చెబుతున్నారు..

ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటారు. అయితే పళ్లు(Teeth) తోముకొని, నోరు శుభ్రం చేసుకోకపోతే గుండె(Heart) సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందట...

Heart Attack: బ్రష్ సరిగా చేసుకోకపోతే గుండె జబ్బులు వస్తాయా..! నిపుణులు ఏం చెబుతున్నారు..
Brush
Follow us

|

Updated on: Apr 06, 2022 | 6:00 AM

ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటారు. అయితే పళ్లు(Teeth) తోముకొని, నోరు శుభ్రం చేసుకోకపోతే గుండె(Heart) సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. నోరు సరిగా శుభ్రం చేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు నిపుణులు. దంత క్షయం, నోటి క్యాన్సర్(mouth Cancer) వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. నోటి కుహరంలో లక్షలాది బ్యాక్టీరియా నివసిస్తుంటుంది. అందుకే నోటి పరిశుభ్రతపై కచ్చితంగా అవగాహన ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

నోటిని పరిశుభ్రం చేసుకోవడం చాలా వరకు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే కొందరు నోటిని శుభ్రం చేసుకునేందుకు బద్ధకిస్తూ ఉంటారు. అలాంటి వారు కొద్దికాలంలో గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా గుండెకు చేరేందుకు అవకాశం ఉందట. మీ టూత్ బ్రష్ ను చిగుళ్ల నుంచి 45 డిగ్రీల కోణంలో ఉంచి.. ఆ తర్వాత మెల్లిగా ముందుకు వెనుకకు బ్రష్ ను కదిలించాలి.

ముందుగా ఎదురు దంతాలను, దంతాల వెలుపల శుభ్రం చేసిన తర్వాత.. దంతాల ఉపరితలం లోపు బ్రష్ చేయాలి. దీని తర్వాత నాలుకను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల నోరు పరిశుభ్రంగా మారుతుంది. రాత్రి పూట కూడా బ్రష్ చేసుకుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మన నోరు చాలా శుభ్రంగా ఉండడమే కాకుండా దంత క్షయం కూడా రాదట. బ్రష్ చేసుకునేటప్పుడు ఎక్కువగా పెస్ట్ కూడా వడొద్దట.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.