Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి..!

Health Tips: చాలా మంది వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, సంతోషం మాట ఎలా ఉన్నా.. ఈ కాలంలో అనేక వ్యాధులు వెంటాడుతుంటాయి.

Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి..!
Food
Follow us

|

Updated on: Jul 07, 2022 | 8:57 PM

Health Tips: చాలా మంది వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, సంతోషం మాట ఎలా ఉన్నా.. ఈ కాలంలో అనేక వ్యాధులు వెంటాడుతుంటాయి. సీజనల్ వ్యాధులతో చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అంటువ్యాధులు వెంటాడుతుంటాయి. అందుకే వర్షంలో తడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, అదే సమయంలో కొన్ని కూరగాయలు, పండ్లు అనారోగ్యానికి కారణం అవుతాయి. అవును.. వర్షాకాలంలో తేమ వల్ల కొన్ని రకాల కూరగాయలు, పండ్లపై సూక్ష్మ జీవులు ఆవాసం ఏర్పరచుకుంటాయి. వాటిని నేరుగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకు ఈ సీజన్‌లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చల్లని, నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోవద్దు.. ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు నిల్వ ఉంచిన, చల్లని ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇలా తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. చల్లని పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలను మళ్లీ వండుకుని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనమవుతుంది. శరీరంలోని ఖనిజాలను నిర్వీర్యం చేస్తాయి. అందుకే, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలను, డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవద్దు.

2. ఆకు కూరలకు దూరంగా ఉండండి.. వర్షాకాలంలో ఉష్ణోగ్రత, తేమ ఆకు కూరలలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అందువల్ల.. పాలకూర, మెంతి ఆకులు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆకు కూరలను ఈ సీజన్‌లో తినడం మానుకోవాలి.

3. బయట తినడం, జ్యూస్‌లు తాగడం మానుకోండి.. వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనువైనది. ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే రెస్టారెంట్లు, వీధుల్లోని దుకాణాల్లో తినడం మానుకోండి. అలాగే.. టైఫాయిడ్, వాంతులు, విరేచనాలకు కారణమయ్యే బయటి జ్యూస్‌లు తాగడం మానుకోండి.

4. సలాడ్లు తినడం మానుకోండి.. సలాడ్లలో పచ్చి ఆహారాన్ని ఉపయోగిస్తారు. పచ్చి ఆహారాన్ని తినడం వల్ల బ్యాక్టీరియా, చిన్న బ్యాక్టీరియాకు తక్షణ ప్రాప్యత లభిస్తుంది. ఇది చివరికి వైరల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ సీజన్‌లో సలాడ్ తినకుండా ఉండండి. సలాడ్‌లకు బదులుగా ఉడికించిన కూరగాయలను తినండి.

5. పెరుగు, మజ్జిగకు దూరంగా ఉండండి.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఎందుకంటే పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది సైనసైటిస్‌ను ప్రోత్సహిస్తుంది. వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా కడుపు నొప్పి, ఉదర సమస్యలు వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..