Health Tips: ఉదయం నిద్రలేవగానే అలసట, నీరసంగా అనిపిస్తుందా? అయితే, ఇవి తప్పనిసరిగా చేయండి..

Health Tips: చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్దకిస్తుంటారు. నిద్ర లేచినప్పటికీ.. గంటల తరబడి మంచంపైనే పడుకుంటారు. నిద్ర లేవగానే అలసటగా,

Health Tips: ఉదయం నిద్రలేవగానే అలసట, నీరసంగా అనిపిస్తుందా? అయితే, ఇవి తప్పనిసరిగా చేయండి..
Morning Wake Up
Follow us

|

Updated on: Sep 12, 2022 | 6:09 AM

Health Tips: చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్దకిస్తుంటారు. నిద్ర లేచినప్పటికీ.. గంటల తరబడి మంచంపైనే పడుకుంటారు. నిద్ర లేవగానే అలసటగా, నీరసంగా ఫీల్ అవుతుంటారు. ఇంకొంతమంది అయితే, నిద్ర లేచిన తరువాత టైంపాస్ కోసం మంచం మీద పడుకుని మొబైల్స్ చూస్తూ ఉంటారు. ఇంకొందరైతే బెడ్ పై నుంచి కింద అడుగు పెట్టాలంటే నర్వస్‌గా ఫీలవుతుంటారు. అయితే, ఇది మానసిక బలహీనతగా పేర్కొంటున్నారు నిపుణులు. దీని కారణంగా వ్యక్తులు రోజంతా డల్‌గా, నిరసంగా ఉంటారని, రోజంతా ఆవలిస్తూనే ఉంటారని చెబుతున్నారు. ఇది చెడు దినచర్యకు నిదర్శనం అని చెబుతున్నారు. ఇలాంటి దినచర్యతోనే మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ చెడు అలవాట్లను మానేయడానికి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ చిట్కాల సహాయంతో నిద్ర లేచిన తరువాత శక్తిని పొందవచ్చు. రోజంతా ఫుల్ యాక్టీవ్‌గా ఉండొచ్చు అని చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాడీ మసాజ్..

ఆయుర్వేదం భారతదేశంలో చాలా పురాతనమైన వైద్య విధానం. ఇందులో బాడీ మసాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. శరీరానికి మర్ధన చేయడం ద్వారా చెడు అలవాట్లను, బద్ధకాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఉదయం లేచిన వెంటనే శరీరానికి 20 నుండి 25 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. బాడీ మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటారు. అదే సమయంలో శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి

సూర్యోదయానికి ముందే మేల్కొనాలి..

ఉదయం లేవడమే పెద్దగా పనిగా భావిస్తే.. మీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇది మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది. ఉదయాన్నే లేచిన తరువాత యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.

మంచి ఆహారం తీసుకోవాలి..

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా శరీరం బద్ధకిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో నూనె, మసాలా పదార్థాలు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం ఆకుపచ్చని కూరగాయలు, తృణధాన్యాలు మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చాలి. వేడి ఆహారాన్ని తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..