Green Chili For Health: ఆరోగ్యానికి మేలు చేసే పచ్చిమిర్చి.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!

Green Chili For Health: అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో మేలంటున్నారు ఆయుర్వేద ..

Green Chili For Health: ఆరోగ్యానికి మేలు చేసే పచ్చిమిర్చి.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!
Green Chili For Health
Subhash Goud

|

Jul 04, 2022 | 2:39 PM

Green Chili For Health: అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇక పచ్చిమిర్చి అనేది అందరికి తెలిసిందే. ప్రతి ఇంట్లో ఉండేదే. ప్రతి వంటకాల్లో పచ్చిమిర్చిని ఉపయోగిస్తుంటారు. పచ్చి మిరపకాయలు ఘాటు కారణంగా చాలా మంది తక్కువగా వాడుతుంటారు. దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. మరి పచ్చిమిర్చి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

జీవక్రియను మెరుగుపరుస్తుంది: పచ్చి మిరపకాయలు మన జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయుర్వేదం ప్రకారం.. పచ్చిమిర్చి తినేటప్పుడు అందులో ఉండే గింజలను కూడా తినాలి.

విటమిన్ సి: ఈ ముఖ్యమైన విటమిన్ కోసం ప్రజలు నిమ్మకాయ, ఇతర పుల్లని పదార్ధాలను తీసుకుంటారు, కానీ పచ్చి మిరపకాయ కూడా దీనికి ఉత్తమ మూలంగా పరిగణించబడుతుంది. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి, మీరు దీన్ని పచ్చిగా తింటే మంచిది.

గుండె కోసం: పచ్చి మిరపకాయల వినియోగం మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. పచ్చిమిర్చి కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు.

ఐరన్ బూస్టర్: పచ్చి మిరపకాయలు శరీరంలోని రక్తహీనతను కూడా తొలగిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఇందులో ఐరన్ పుష్కలంగా లభ్యమవుతుంది. అందుకే దీనిని ఐరన్ బూస్టర్ అంటారు. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu