Health: నైట్‌ షిఫ్ట్‌లో పని చేస్తున్నారా.? ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా పని వేళల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ ఇప్పుడు 24*7 వర్క్‌ మోడ్‌తో...

Health: నైట్‌ షిఫ్ట్‌లో పని చేస్తున్నారా.? ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..
Follow us

|

Updated on: May 23, 2022 | 6:35 AM

Health: మారుతోన్న కాలానికి అనుగుణంగా పని వేళల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ ఇప్పుడు 24*7 వర్క్‌ మోడ్‌తో ప్రతీ రోజూ పని వేళలు ఉంటున్నాయి. దీంతో రొటేషనల్‌ షిఫ్ట్స్‌ అమలు చేస్తున్నారు. ఇక నైట్‌ షిప్ట్‌ కల్చర్‌ కూడా భారీగా పెరిగిపోయింది. అయితే నైట్‌ ఫిఫ్ట్‌ చేసే వారు పలు రకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు.

నిద్ర లేకపోవడం ఉదయం సరిగ్గా నిద్ర పట్టకపోవడం వెరసి అనారోగ్యాలకు దారి తీస్తుంటాయి. అంతేకాకుండా ఆహార అలవాట్లలో కూడా మార్పులు వస్తుంటాయి. అయితే నైట్‌ షిఫ్ట్స్‌లో పని చేస్తూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అవేంటంటే..

* నైట్‌ షిఫ్ట్స్‌ చేసే వారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. కొందరు రాత్రంతా పని చేసి ఉదయం కూడా సరిగ్గా నిద్రపోరు. ఉదయం పూట ఏదో ఒక పని ఉండడం. నిద్రపోవడానికి అనువైన వాతావరణం ఉండకపోవమే కారణం. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిద్రను నెగ్లెక్ట్‌ చేయకూడదు. కచ్చితంగా ఉదయం కనీసం 7 గంటలకు తగ్గకుండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* రాత్రంతా అదే పనిగా పని చేయకుండా కాసేపు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. వీలైతే ఓ అరంగ కునుకు తీయాలి.

* చాలా మంది బ్రేక్‌ సమయాల్లో జంక్‌ ఫుడ్‌ తింటుంటారు. కానీ ఇలా చేయకూడదు. వీలైనంత వరకు ఫ్రూట్స్‌ లేదా డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి.

* ఇక రాత్రుళ్లు పనిచేసే వారు నీటిని ఎక్కువగా తాగరు కానీ ఎట్టి పరిస్థితుల్లో నీరు తాగడం మానకూడదు.

* టీ, కాఫీ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

* రాత్రంతా వర్క్‌ చేశామన్న కారణంతో చాలా మంది ఉదయం వర్కవుట్‌ను స్కిప్‌ చేస్తుంటారు. కానీ కనీసం ఒక 30 నిమిషాలైనా ఉదయం లేదా, సాయంత్రం వ్యాయామం కచ్చితంగా చేయాలి.

* నైట్‌ ఫిష్ట్‌ చేసే వారు ఉదయమంతా ఇంటిలో ఉంచి బయటకు రాకుండా ఉంటారు. కానీ అలా చేయకూడదు. కొద్దిసేపైనా ఎండలో తిరగాలి. నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది డి విటమిన్‌ లోపంతో బాధపడడానికి ఇదే కారణం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..