Mental Wellness: రాత్రీపగలు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారా..?.. అయితే మీకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్..

ప్రస్తుత సమాజంలో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడింది. పని ఒత్తిడి, సమస్యలు, కుటుంబ పోషణ.. ఇలా కారణమేదైనా.. మానసికంగా కుంగిపోతున్నారు. ఫలితంగా మెంటల్ గా..

Mental Wellness: రాత్రీపగలు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారా..?.. అయితే మీకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్..
social media
Follow us

|

Updated on: Feb 07, 2023 | 5:17 PM

ప్రస్తుత సమాజంలో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడింది. పని ఒత్తిడి, సమస్యలు, కుటుంబ పోషణ.. ఇలా కారణమేదైనా.. మానసికంగా కుంగిపోతున్నారు. ఫలితంగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ సమస్యను తేలికగా తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే.. చాలా మంది మానసిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చెడు అలవాట్లు మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా మందికి ఈ విషయం తెలియదు. జంక్ ఫుడ్ తినడం, వ్యాయామాలు చేయకపోవడం, సరైన దినచర్యను పాటించకపోవడం వంటివి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. గుండె జబ్బులకు దారి తీస్తాయి. శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్లే.. కొన్ని మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, ఇది నిరాశ, ఆందోళన, ఒత్తిడికి దారి తీస్తుంది.

సాధారణంగా చాలా మంది మనస్సులో ప్రతికూల ఆలోచనలు ఉంటాయి. వాటిని పెంచుకోవడం వల్ల లైఫ్ కష్టంగా మారుతుంది. ఇది తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఈ ఆలోచనలు, భావాలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. సోషల్ మీడియా అనేది స్నేహితులు, బంధువులతో కనెక్ట్ అవ్వడానికి కనుగొన్న సాధనం. ప్రస్తుతానికి వీటి వినియోగం బాగానే ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తాయి. చాలా మంది వ్యక్తులు తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం కోసం ప్రతిరోజూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ పోలికలు తరచుగా అసూయ, నిరాశ, ఆందోళనకు దారితీస్తాయి.

సోమరితనంగా ఉన్నప్పుడు మెదడు.. రోజువారీ చేసే కార్యాచరణను కోల్పోతుంది. ఇది ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. శరీరం, మనసు విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర మంచి సాధనం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..