అర్ధరాత్రి వరకు మేల్కొంటున్నారా.. అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే.. మేల్కోకుంటే పెను ముప్పే

మనం ఆరోగ్యంగా జీవించేందుకు నిద్ర(Sleeping) అనేది ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతికత, విపరీత ధోరణుల కారణంగా నిద్రపోయే వేళల్లో విశేష మార్పులు చోటు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు మేల్కొవడం, బారెడు పొద్దెక్కాక నిద్రలేవడం...

అర్ధరాత్రి వరకు మేల్కొంటున్నారా.. అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే.. మేల్కోకుంటే పెను ముప్పే
Sleeping
Ganesh Mudavath

|

Jun 26, 2022 | 10:45 AM

మనం ఆరోగ్యంగా జీవించేందుకు నిద్ర(Sleeping) అనేది ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతికత, విపరీత ధోరణుల కారణంగా నిద్రపోయే వేళల్లో విశేష మార్పులు చోటు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు మేల్కొవడం, బారెడు పొద్దెక్కాక నిద్రలేవడం ప్రస్తుత రోజుల్లో సాధారణమైపోయింది. ఫలితంగా ఎన్నో రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ల వరకూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను అంత తేలిగ్గా తీసిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు(Health Problems) తీవ్ర ముప్పు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనేక కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వర్క్ చేయడం, టీవీ, ఫోన్ చూడడం వంటి కారణాల వల్ల పడుకునే సమయం పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తోంది. సరైన సమయానికి నిద్రపోయే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా రోజుకు కనీసం 6 నుంచి 9 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.

రోజులో ఎక్కువ సమయం మెలకువగానే ఉంటే.. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ కారణాల వల్ల రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. కంటికి కనుకు దూరమైతే జీవ గడియారం దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్రలేమితో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోకపోతే ఒత్తిడి పెరిగి పూర్తిగా నిరాశలో కూరుకుపోతున్నారని ఓ సర్వేలో తేలింది. సరిగా నిద్రలేకపోతే విపరీతంగా బరువు ఊబకాయం సమస్య తలెత్తుంది.

సరైన సమయానికి నిద్రపోతే ఒత్తిడి, నిరాశ వంటివి దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. పనులు సులభంగా చేసుకోవచ్చు. మెదడుపై ఒత్తిడి తగ్గి, మెరుగైన ఆరోగ్యం కలుగుతుంది. నిద్రపోయేందుకు ఒక టైం టేబుల్ ను సిద్దం చేసుకుంటే జీవ గడియారం మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu