Eyes: చేతితో కళ్లు నులుముకుంటున్నారా.. అయితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది..

మన శరీరంలో కళ్లు చాలా సున్నితమైనవి.. వాటిని మనం బాగా చూసుకోవాలి. లేకుంటే కళ్లు దెబ్బతింటాయి. చాలామంది కళ్లల్లో దుమ్ము పడడం లేద ఇతర కారణాల వల్ల కళ్లు నులుముకుంటారు. కానీ అలా చేయడం వల్ల....

Eyes: చేతితో కళ్లు నులుముకుంటున్నారా.. అయితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది..
Eye

మన శరీరంలో కళ్లు చాలా సున్నితమైనవి.. వాటిని మనం బాగా చూసుకోవాలి. లేకుంటే కళ్లు దెబ్బతింటాయి. చాలామంది కళ్లల్లో దుమ్ము పడడం లేద ఇతర కారణాల వల్ల కళ్లు నులుముకుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజమని చెబుతున్నారు వైద్యులు. నులుముకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా అనవసరంగా కళ్లను చేతులతో రుద్దుకోకూడదు. కళ్లు నులుముకోవడం వల్ల కళ్లలో విపరీతంగా మంట వస్తుంది. చికెన్ వైరస్, బ్యాక్టీరియా కంటిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మన చేతివేళ్లకు కారం లాంటి పదార్థాలు లేదా దుమ్ము ధూళి ఉన్నా… ఇరిటేషన్, బర్నింగ్ సెన్షేషన్ లాంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

అలాగే కళ్ల బాగుండాలంటే మనం A విటమిన్ ఉన్న పదార్థలు ఎక్కువగా తీసుకోవాలి. చేపలు, పాలు, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో A విటమిన్ ఎక్కువగా ఉంటుంది. క్యారట్, ఆకుకూరల్లో కూడా A విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ A లోపంవల్ల రేచీకటి, జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా వ్యాధులు వస్తాయి. కలుగుతాయి. ఈ మధ్య పిల్లలుకు చిన్నతనంలోనే కంటి సమస్యలు వస్తున్నాయి. వారు కంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వారికి A విటమిన్ పదార్థలు ఎక్కువగా ఇవ్వాలి. చిన్నపటి నుంచే చేపలు, గుడ్లు, ఆకు కూరలు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

Read Also.. Heart Beat: గుండె వేగంగా కొట్టుకుంటే పెను ప్రమాదం.. హృదయ స్పందన వేగాన్ని నియంత్రించే బెలూన్ రూపొందించిన పరిశోధకులు!

Click on your DTH Provider to Add TV9 Telugu