Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారా? అయితే, ఈ కీలక సమాచారం మీకోసమే..!

Health Insurance: కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. ఆసుపత్రుల్లో పడకలు లేక వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారా? అయితే, ఈ కీలక సమాచారం మీకోసమే..!
Health Insurance
Shiva Prajapati

|

Nov 19, 2021 | 6:55 PM

Health Insurance: కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. ఆసుపత్రుల్లో పడకలు లేక వేలాది మంది మృత్యువాత పడ్డారు. దాంతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రి అనే తేడా లేకుండా ఏ ఆసుపత్రిలో వైద్యం కోసం చోటు దొరికితే అక్కడ చేరిపోయారు బాధితులు. అయితే, కొందరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండగా.. దానిని ఉపయోగించుకుని, ఆస్పత్రులలో ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. అయితే, ఆ సమస్యంలో చికిత్స చేయించుకుని ఇప్పటికీ ఆరోగ్య బీమా క్లెయిమ్ పొందని వారు చాలామంది ఉన్నారు. ఆరోగ్య బీమా తీసుకొని, ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లిస్తున్నా. క్లెయిమ్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే, మీరు కూడా ప్రిమియం సరైన సమయానికి కడుతూ.. క్లెయిమ్ రాకపోతే ఏం చేయాలి? మీ హక్కులేంటి? వంటి కీలక వివరాలు తెలుసుకోండి.

కరోనా మహమ్మారి సమయంలో, ఆరోగ్య బీమా కంపెనీలు సకాలంలో రోగుల క్లెయిమ్‌లను క్లియర్ చేయకపోవడమే కాకుండా.. తిరస్కరించాయి కూడా. ఇలాంటి కేసులు అనేకం వెలుగుచూశాయి. అయితే, తిరస్కరణకు సరైన కారణం లేకుండా, అసంబద్ధ వాదనలతో క్లెయిమ్స్‌ని రిజక్ట్ చేశారు. ‘‘కరోనా వచ్చినా ఇంట్లో ఉంటే సరిపోయేది.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు.. మీకు క్లెయిమ్ చేయడం కుదరదు’ అని చాలా ఏజెన్సీలు తిర్కరించాయి. మీరు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే మరేం టెన్షన్ పడాల్సిన పనిలేదు. సదరు ఏజెన్సీపై ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.

ఎవరికి ఫిర్యాదు చేయాలంటే.. వాస్తవానికి బీమా ఏదైనా.. 30 రోజుల లోపు క్లెయిమ్ చేయాలి. అలా చేయకుండా అసమంజసమైన వాదనలు చెబుతూ క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే.. మీరు వెంటనే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల ఇలాంటి కేసే ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది. దానిపై లోక్‌పాల్‌లో వాదనలు కూడా జరిగాయి. బాధితుల వాదనలను లోక్‌పాల్ సమర్థించింది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వారిని డాక్టర్‌ నిర్ధారణ గురించి TPA(థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్) ప్రశ్నించడం అసంబద్ధమైన చర్యగా పేర్కొంది.

TPA (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్) ఎవరు? 1. టీపీఏ.. బీమా కస్టమర్, కంపెనీకి మధ్యవ్యర్తిత్వం వహిస్తుంది. కస్టమర్లకు ఆరోగ్య బీమా అవసరపడితే.. టీపీఏకి తెలియజేయాలి. అది కంపెనీకి తెలియజేస్తుంది. 2. టీపీఏ క్లెయిమ్, సెటిల్‌మెంట్‌ను ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. 3. బీమా కంపెనీలు నేరుగా నిర్వహించకుండా.. టీపీఏల ద్వారా సేవలు అందిస్తాయి. 4. అయితే, కంపెనీలను సంతృప్తి పరచడానికి టీపీఏ బీమా మొత్తాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తాయి.

వాస్తవానికి, గత కొంతకాలంగా ఆసుపత్రిలో చేరడం అనవసరమని పేర్కొంటూ క్లెయిమ్‌లను తిరస్కరించే కేసులు గణనీయంగా పెరిగాయి. కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో, సుప్రీంకోర్టు జస్టిస్ విపిన్ సంఘీ, రేఖ పల్లి బెంచ్ బీమా కంపెనీ, TPA 60 నిమిషాల్లో క్లెయిమ్‌ను ఆమోదించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమలు కావడం లేదు. నేటికీ క్లెయిమ్ కేసులు పరిష్కారం కావడం లేదు.

లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసే విధానం 1. మీ క్లెయిమ్ కూడా తిరస్కరించబడితే ఆ విషయాన్ని అంబుడ్స్‌మన్‌కు నివేదించాలి. 2. వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. 3. ఇ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. 4. దేశంలో 17 లోక్‌పాల్ కేంద్రాలు ఉన్నాయి. 5. IRDAI సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. (www.irdai.gov.in) 6. కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌ కూడా చేయవచ్చు (www.cioins.co.in)

క్లెయిమ్ తిరస్కరణ, క్లెయిమ్‌లు ఇవ్వడంలో జాప్యం, నాసిరకం ఉత్పత్తులను విక్రయించడం వంటి ఫిర్యాదులతో కస్టమర్‌లు అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు, చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలు, బిల్లులను జత చేయాల్సి ఉంటుంది. ఈవిషయాన్ని ఫిర్యాదుదారులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

Also read:

Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..

Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu