Child Care Tips: మీ పిల్లలు టీవీలకే అతుక్కుపోతున్నారా? ఆ అలవాటుకు ఇలా చెక్ పెట్టండి..!

Child Care Tips: టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఓ రేంజ్‌లో ఉపయోగించుకుంటున్నారు.

Child Care Tips: మీ పిల్లలు టీవీలకే అతుక్కుపోతున్నారా? ఆ అలవాటుకు ఇలా చెక్ పెట్టండి..!
Child Care
Follow us

|

Updated on: Jul 26, 2022 | 9:28 AM

Child Care Tips: టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఓ రేంజ్‌లో ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు దాని నుంచి చాలానే నేర్చుకుంటున్నారు. అయితే, ఏదైనా పరిమితిలో ఉంటేనే బాగుంటుంది. లేదంటే.. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు.. ఫోన్లకు, టీవీలకు బాగా అలవాటు పడిపోయారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ఫోన్, టీవీ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

మీ పిల్లలు కూడా అవసరానికి మించి టీవీ చూస్తున్నట్లయితే, ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నట్లయితే.. వారి కళ్లకే కాకుండా.. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. పిల్లల్లో ఈ అలవాటును మాన్పించకపోతే.. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఈ దుష్ఫలితాలు రాకుండా ఉండటానికి.. వారి అలవాట్లను మాన్పించే ప్రయత్నం చేయాలి. టీవీ, ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలకు ప్రేమగా, సున్నితంగా వివరించి.. ఆ అలవాట్లను మాన్పించేలా చేయాలి.

ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు: 1. పిల్లలు టీవీ ద్వారా కథలు, పాటలు వింటూ వివిధ విషయాలు నేర్చుకుంటారు. అయితే, ఎక్కువ సేపు టీవీ చూడటం వారి మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

2. టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి కళ్లపై ప్రభావం పడుతుంది. టీవీ స్క్రీన్ లైటింగ్ వల్ల కళ్లు దెబ్బ తింటాయి. ఇంకా నిరంతరం ఒకే చోట కూర్చుని టీవీ చూడటం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దాని వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలు ఆటలాడటం చాలా ముఖ్యం. ఒకే చోట కూర్చోవడం కూడా వారి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.

3. పిల్లలు టీవీలో చూసేవాటిని (విషయాలు, పాటలు) అనుకరిస్తారు. తదనుగుణంగా ప్రవర్తిస్తారు. పిల్లలు హింసాత్మక దృశ్యాలను చూసినట్లయితే.. వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పిల్లలు టీవీలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి.

4. ఒకే చోట కూర్చోవడం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. చిన్న వయసులోనే శరీరానికి ఇలాంటి వ్యాధులు రావడం మంచిది కాదు.

5. నిరంతరం టీవీ చూడటం వల్ల పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. బయట ఆడటం లేదు. చివరకు సోమరిపోతులుగా మారిపోతారు. అదికాస్తా అతిగా తినేందుకు దారి తీస్తుంది. బరువు పెరిగే ప్రమాదమూ ఉంది.

అలవాట్లను ఇలా మాన్పించండి.. పిల్లలు ఎక్కువగా టీవీ చూడకూండా వారిని నియంత్రించండి. దానికంటే ముందుగా మీరు ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తల్లిదండ్రులు చెప్పేదానికంటే తల్లిదండ్రులు చేసే పనులపైనే పిల్లలు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కావున.. ముందుగా మీరు మంచి అలవాట్లను అలవర్చుకుంటే పిల్లలు ఆటోమేటిక్‌గా వాటిని అనుసరిస్తారు. మీరు టీవీ చూడటం తగ్గిస్తే.. పిల్లలు కూడా క్రమంగా టీవీని చూడటం తగ్గిస్తారు.

పిల్లలు ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతుంటారు. ఖాళీగా ఉండలేరు. అందుకే వారు ఏం చేయాలనుకుంటున్నారో ముందే గమనించాలి. గేమ్స్ ఆడించాలి. బొమ్మలు గీయించాలి. పేయింట్స్ వేయించాలి. ఫజిల్స్ క్లియర్ చేయించాలి.

పిల్లలకు క్రీడలు, కొత్త కళలను నేర్పాలి. వారి దృష్టి దానిపైనే కేంద్రీకరించబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల వారి మెదడు అభివృద్ధి చెందడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

టీవీ ఆఫ్ చేయడం వలన పిల్లలు ఏం చేయాలా? అని ఆలోచిస్తారు. అలాంటప్పుడు బయటకు వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించాలి. అవసరమైతే తల్లిదండ్రులే కొంత సమయం తీసుకుని వారితో ఆడుకోవాలి. క్రమంగా వారికి గాడ్జెట్‌ల అలవాటు తగ్గుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు