లైట్ తీసుకోకండి.. ఇలాంటి అలవాట్లు ఉంటే మైండ్ దొబ్బుతుందంట..! జాగ్రత్త

|

Sep 22, 2024 | 1:37 PM

అల్జీమర్స్ అనేది మెదడు కణాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి.. క్రమంగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, మనిషి ప్రవర్తనను బలహీనపరుస్తుంది. ఇది వయోభారంలో వచ్చే వ్యాధి.. అయితే.. వయస్సు చాలా సాధారణం అయినప్పటికీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

లైట్ తీసుకోకండి.. ఇలాంటి అలవాట్లు ఉంటే మైండ్ దొబ్బుతుందంట..! జాగ్రత్త
Brain Health
Image Credit source: Getty Images
Follow us on

ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకోసమే మంచి ఆహారం.. ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అంతేకాకుండా.. శరీరంతోపాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. కొన్ని విషయాలను అస్సలు లైట్ తీసుకోకూడదు.. అవే పెను ప్రమాదకరంగా మారుతాయి.. అయితే.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీని ‘ప్రపంచ అల్జీమర్స్ డే’గా జరుపుకుంటారు.. తద్వారా ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పిస్తారు. అల్జీమర్స్ అనేది మెదడు కణాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి.. క్రమంగా జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, మనిషి ప్రవర్తనను బలహీనపరుస్తుంది. ఇది వయోభారంలో వచ్చే వ్యాధి.. అయితే.. వయస్సు చాలా సాధారణం అయినప్పటికీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడుకు హాని కలిగించే అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే కొన్ని సాధారణ అలవాట్లను ఇప్పుడు తెలుసుకోండి.. వీటి ద్వారా కూడా మెదడు ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తగినంత నిద్ర లేకపోవడం

తగినంత నిద్ర లేకపోవడం మెదడుకు చాలా హానికరం. నిద్రలో, మెదడు ప్రక్షాళన ప్రక్రియ జరుగుతుంది.. ఇది విషాన్ని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా తక్కువ నిద్రపోవడం వల్ల మెదడులో టాక్సిన్స్ పేరుకుపోతాయి.. ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక చక్కెర – ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల..

చక్కెర- ప్రాసెస్ చేసిన ఆహారం మెదడు దెబ్బతింటుంది. ఈ ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల మెదడు కణాల మధ్య సంబంధాలు బలహీనపడతాయి. ఇది జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు క్షీణతకు దారితీస్తుంది.

మానసిక వ్యాయామం లేకపోవడం

మానసిక వ్యాయామం లేకపోతే మెదడు చురుగ్గా ఉండదు.. చదువులకు దూరంగా ఉండడం లేదా మానసిక సవాళ్లకు దూరంగా ఉండడం కూడా అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొత్త సవాళ్లు, కార్యకలాపాలతో మనస్సును నిరంతరం బిజీగా ఉంచుకోవడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం..

శారీరక వ్యాయామం శరీరానికే కాదు మనసుకు కూడా ముఖ్యం. వ్యాయామం మెదడులో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది న్యూరానల్ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.. అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒంటరితనం – బంధాలు లేకపోవడం

ఎక్కువ కాలం సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం కూడా అల్జీమర్స్‌కు కారణం కావచ్చు. ఒంటరితనం మెదడు కార్యకలాపాల్లో క్షీణతకు కారణమవుతుంది.. ఇంకా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఈ అలవాట్లకు దూరంగా ఉండి, మన మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉండటానికి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..