ఆఫీసులో కూర్చొని కూర్చొని.. నడుం నొప్పి లేస్తుందా..! అయితే ఇలా చేయండి.. మీరు ఊహించనంత ఉపశమనం లభిస్తుంది..

Back Pain Treatments ; ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని

ఆఫీసులో కూర్చొని కూర్చొని.. నడుం నొప్పి లేస్తుందా..!  అయితే ఇలా చేయండి.. మీరు ఊహించనంత ఉపశమనం లభిస్తుంది..
Follow us

|

Updated on: Mar 01, 2021 | 5:47 AM

Back Pain Treatments ; ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో.. ఈ సమస్యను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1.కంప్యూటర్ ముందు కూర్చోవడం : ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్స్ పైనే వర్క్ చేస్తున్నారు. ఈ సమయంలో కూర్చునే పొజిషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. లేదా సమస్య ఎక్కువవుతుంది. మానిటర్ కళ్లకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తలభాగం సరిగా ఉండేలా చూడాలి. అదేవిధంగా.. కళ్లకు, మానిటర్‌కు మధ్య కనీసం 20 అంగుళాల దూరం ఉండాలి. మణికట్టు కూడా తిన్నగా ఉండేలా.. మోచేతులు 90 డిగ్రీల యాంగిల్‌లో ఉండేలా చూసుకోవాలి. కీబోర్డ్, మౌస్ సమాన ఎత్తులోనే ఉంచుకోవాలి. అదే విధంగా కూర్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుకభాగం కుర్చీ వెనుకభాగానికి తాకేలా ఉండాలి. పాదాలు పూర్తిగా నేలను తాకాలి. కుర్చీ ఎత్తుగా ఉంటే పాదాల కింద ఎత్తు పెట్టుకోవాలి. వీపు వంపు దగ్గర చిన్న దిండు, లేదా టవల్, చున్నీ లాంటి వాటిని పెట్టుకోవచ్చు.

2.ఇలా నిలబడండి: బరువు మడమల మీద పడేలా నిలబడండి.. పాదాలు కాస్తా ఎడంగా పెట్టాలి. చేతులని బిగపెట్టినట్టుగా కాకుండా వదులుగా, సహజంగా వేలాడేలా చూసుకోవాలి. తల, భుజాలను ముందుకు కానీ, వెనక్కీ కాకుండా ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువసేపు నిలబడకుండా.. శరీరబరువును ఒక కాలు నుంచి మరో కాలుకు ఇలా మారుస్తుండాలి. ఉదయం లేవగానే చేతులు, కాళ్ల కండరాలు బిగుసుపోయినట్టు ఉంటాయి. అయితే కొన్ని స్ట్రెచింగ్ చేసే కొన్ని వ్యాయామాలు ఉంటాయి. వాటిని చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

3.డ్రైవింగ్ చేసేటప్పుడు : బైక్ డ్రైవ్ చేసినప్పుడు నడుమును నిటారుగా ఉంచాలి. అలా కాకుండా ముందుకు లేదా వెనక్కి ఉండేలా వంచకూడదు. ఇక కారు డ్రైవ్ చేసినప్పుడు నడుము వెనుక దిండు పెట్టుకోవాలి. వీపుకి సపోర్ట్ ఇచ్చేలా సీటుని స్టీరింగ్ దగ్గరకు జరుపుకోవాలి. సీటు, స్టీరింగ్‌కి మధ్య మోకాళ్లు వంచటానికి.. బ్రేక్, క్లచ్‌లకు పాదాలు సరిగా తాకటానికి అవసరమైనంత దూరం ఉండేలా చూడాలి. అదే విధంగా.. ఎక్కువసేపు డ్రైవ్ చేయాలసి వస్తే.. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకుంటూ డ్రైవ్ చేయాలి.

4.పడుకునే సమయంలో : పడుకునే పరుపులు మరీ మెత్తగా, గట్టిగా ఉండకుండా సమాంతరంగా, బల్లపరుపుగా ఉండేలా చూసుకోవాలి. బోర్లాపడుకునే అలవాటుంటే తగ్గించాలి. వెల్లకిలా, పక్కకు తిరిగి పడుకోవాలి. పక్కకు తిరిగి పడుకునేటప్పుడు కాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి. అదేవిధంగా ఏళ్ల తరబడి ఒకే పరుపును వాడటం కూడా మంచిది కాదు.. సాధారణంగా నాణ్యమైన పరుపులు కూడా పదేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే వీటిపై పడుకున్నప్పుడు నడుము పట్టేసినట్టు ఉంటుంది. అందుకే మారుస్తూ ఉండడం మంచిది. పరుపులు మరీ గట్టిగా, మెత్తగా ఉండేవి కాకుండా సౌకర్యంగా ఉన్నవాటిని ఎంచుకోవాలి.

5.బరువులు ఎత్తే సమయంలో : చాలామంది బరువులు ఒకేసారి ఎత్తుతారు.అలా కాకుండా.. మోకాళ్లు, నడుమను ముందుకు వంచుతూ వస్తువులను పట్టుకోవాలి. పాదాలను నేలపై గట్టిగా ఆనించి.. కడుపుని గట్టిగా బిగించి వస్తువులను ఎత్తాలి. బరువు ఎత్తే సమయంలో పక్కకు తిరగకూడదు. నడుము భాగానికన్నా ఎత్తులో ఉండే బరువును ఎత్తాల్సినప్పుడు వాటి దగ్గరకు వచ్చి.. మోకాళ్లను వంచుతూ వస్తువులను పట్టుకుని పైకి లేవాలి.

రెమిడెసివిర్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో ఊహించని ప్రకటన

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.