Health Tips: జలుబు త్వరగా తగ్గాలంటే..!

Health Tips: జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతుంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. దానికి తోడు ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. జలుబును త్వరగా తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి. ఏంటంటే.. గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే… వెంటనే ఉపశమనం కలుగుతుంది.గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్‌ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:30 pm, Fri, 21 February 20

Health Tips: జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతుంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. దానికి తోడు ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. జలుబును త్వరగా తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి. ఏంటంటే..

గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే… వెంటనే ఉపశమనం కలుగుతుంది.గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్‌ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో జలుబు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్‌ టీని తాగడం వల్ల జలుబును తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.

జలుబు చేసినప్పుడు విశ్రాంతి అవసరం. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల… మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్కసారి అది పెరిగిందంటే… ఇక వ్యాధిని తెచ్చే క్రిముల పని అయిపోయినట్లే. నారింజ పండ్లలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్‌ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది. పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్‌ సూప్‌ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.