మంత్రి ఈటెలతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు?

Health Minister Etala Rajender met with CM Kcr in PragathiBhavan, మంత్రి ఈటెలతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు?

మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ఆరోగ్యమంత్రి ఈటలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చర్చలు జరపడం ఆసక్తిని రేపుతోంది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో యూరియా సమస్యతో పాటు జ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు సైతం వణికిస్తున్నందున దీనిపైనే చర్చించినట్టుగా కూడా సమాచారం.

ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈటెలను తప్పిస్తారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై మంత్రిస్ధాయిలో ఉండి వ్యతిరేకంగా మాట్లాడటం తీవ్ర చర్చకు దారితీసింది. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనంటూ మంత్రి ఈటెల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతను బహిర్గతం చేస్తాయని గ్రహించి ముందే నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇలాంటి సమయంలో మంత్రి ఈటెలతో సీఎం కేసీఆర్ చర్చించడం సస్పెన్స్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *